IND vs SA : ప్రసిద్ధ్ కృష్ణ పై కేఎల్ రాహుల్ ఫైర్.. నీ బుర్ర వాడాల్సిన అవసరం లేదు.. నేను చెప్పినట్లు చేయి.. వీడియో వైరల్
దక్షిణాఫ్రికాతో బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SA) టీమ్ఇండియా 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది.
IND vs SA KL Rahul Irritated By Prasidh Krishna As South Africa Go Bonkers Chasing 359
IND vs SA : దక్షిణాఫ్రికాతో బుధవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా పేసర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ అయితే.. 8.2 ఓవర్లలో ఏకంగా 85 పరుగులు ఇచ్చాడు. రెండు వికెట్లు పడగొట్టాడు
సాధారణంగా ఎంతో కూల్‌గా కనిపించే కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో ఓ సందర్భంలో తన సహనం కోల్పోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IND vs SA : విశాఖలో టీమ్ఇండియా రికార్డు ఎలా ఉందో తెలుసా? సిరీస్ పోరులో విజేతగా నిలిచేది ఎవరంటే?
ఈ వీడియోలో.. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. నేను నీకు చెప్పిన చోట బౌలింగ్ చేయి. ఎక్కడ బంతి వేయాలో అన్న విషయాన్ని చెప్పాను గదా.. అలా చేయి.. సొంత నిర్ణయాలు వద్దు. బౌన్సర్లు వేయకు.. అని కన్నడలో అన్నాడు. బౌన్సర్ వేయాలా అని ప్రసిద్ధ్ అడగడంతో రాహుల్‌కు మరింత చిరాకు వచ్చింది. ఇప్పుడే చెప్పాగా.. మళ్లీ బౌన్సర్ ఎందుకు బ్రో అంటూ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు.
వీరి మాటలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. వీరిద్దరు కర్ణాటకు చెందిన వారు కావడంతో కన్నడలో మాట్లాడుకున్నారు.
ಪಂದ್ಯದ ನಡುವೆ Prasidh Krishna ಅವರಿಗೆ KL Rahul ರವರ ವಿಶೇಷ ಕಿವಿಮಾತು!👏🏻🗣
📺 ವೀಕ್ಷಿಸಿ | #INDvSA 👉 2nd ODI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports 2 ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TeamIndia pic.twitter.com/OkNN2aqkMc
— Star Sports Kannada (@StarSportsKan) December 3, 2025
Rohit Sharma : విశాఖలో దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..
రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్‌కు ఈ సిరీస్‌లో నాయకత్వ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే.
