Rohit Sharma : విశాఖలో దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) భారీ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు.
Rohit Sharma is 27 short of 20000 international runs
Rohit Sharma : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారీ రికార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. అతడు శనివారం విశాఖ వేదికగా దక్షిణాప్రికాతో జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌లో 27 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల కంటే ఎక్కువ పరుగులు సాధించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేల రన్స్ పరుగులు చేసిన భారత బ్యాటర్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ – 34357 పరుగులు
* విరాట్ కోహ్లీ – 27910 పరుగులు
* రాహుల్ ద్రవిడ్ – 24064 పరుగులు
రోహిత్ శర్మ (Rohit Sharma) ఇప్పటి వరకు 504 అంతర్జాతీయ మ్యాచ్‌లు (67 టెస్టులు, 278 వన్డేలు, 159 టీ20లు)ఆడాడు. 19,973 పరుగులు (టెస్టుల్లో 4301, వన్డేల్లో 11441, టీ20ల్లో 4231) సాధించాడు. మొత్తంగా 50 శతకాలు, 110 అర్థశతకాలు అతడి ఖాతాలో ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉంది. రాంచీ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో విశాఖ వేదికగా జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో వారే 2-1తో తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
