Joe Root : టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసేందుకు జోరూట్‌కు ఎన్ని రన్స్ కావాలో తెలుసా?
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ (Joe Root) భీకర ఫామ్‌లో ఉన్నాడు.
Most runs in Test cricket do tou know How many runs does Joe Root need to break Sachin record
Joe Root :ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో శతకంతో చెలరేగాడు. 206 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 138 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై రూట్(Joe Root)కు ఇది తొలి సెంచరీ కగా.. టెస్టుల్లో అతడికి ఇది 40వ సెంచరీ.
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 200 టెస్టుల్లో 53.78 సగటుతో 15921 పరుగులు చేశాడు. ఇందులో 51 శతకాలు, 68 అర్థశతకాలు ఉన్నాయి. టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ప్రస్తుతం ఒక్క రూట్‌కు మాత్రమే ఉంది. రూట్ ఇప్పటి వరకు 160 మ్యాచ్‌లు ఆడాడు. 51.46 సగటుతో 13689 పరుగులు చేశాడు. ఇందులో 40 శతకాలు 66 అర్ధశతకాలు ఉన్నాయి.
టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాలంటే రూట్‌కు ఇంకా 2232 పరుగులు అవసరం. ప్రస్తుతం రూట్ వయసు 34 ఏళ్లు.
టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
* సచిన్ టెండూల్కర్ (భారత్) – 15921 పరుగులు
* జో రూట్ (ఇంగ్లాండ్) – 13689* పరుగులు
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 13378 పరుగులు
* జాక్వస్ కలిస్ (దక్షిణాఫ్రికా) – 13289 పరుగులు
* రాహుల్ ద్రవిడ్ (భారత్) – 13288 పరుగులు
