Rohit Sharma : చరిత్ర సృష్టించిన రోహిత్ శ‌ర్మ‌.. ఒకే ఒక్క భార‌తీయుడు.. ఆ వెనకే విరాట్ కోహ్లి

తొలి భార‌త బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు.

Rohit Sharma becomes first indian player to hit 1500 plus boundaries in t20 cricket

Rohit Sharma 1500 plus boundaries : ఐపీఎల్ 2024లో ఎట్ట‌కేల‌కు ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది. ఆదివారం వాంఖ‌డే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 29 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇదే మొద‌టి విజ‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై నాలుగు మ్యాచులు ఆడ‌గా మూడు మ్యాచుల్లో ఓడింది. ఒక్క మ్యాచులో మాత్ర‌మే విజ‌యం సాధించ‌గా రెండు పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో కొన‌సాగుతోంది.

ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆట‌గాడు, రోహిత్ శ‌ర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న అత‌డు 6 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 49 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో ఓ అరుదైన రికార్డును హిట్‌మ్యాన్ అందుకున్నాడు. ఢిల్లీతో మ్యాచులో ఫోర్లు, సిక్స‌ర్లు క‌లిపి మొత్తం 9 బౌండ‌రీలు కొట్టాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 1500 కు పైగా బౌండ‌రీలు కొట్టిన తొలి భార‌త బ్యాట‌ర్‌గా రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు.

Virat Kohli : రాజ‌స్థాన్‌పై ఓట‌మి.. ఒంట‌రిగా డ‌గౌట్‌లో కూర్చోన్న కోహ్లి.. బెంగ‌ళూరు డ్రెస్సింగ్ రూమ్‌లో సంజూశాంస‌న్‌

ఈ జాబితాలో రోహిత్ శ‌ర్మ త‌రువాతి స్థానంలో ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఉన్నాడు. కోహ్లి ఇప్ప‌టి వ‌రకు 1486 బౌండ‌రీలు బాదాడు. ఇక ఓవ‌రాల్‌గా తీసుకుంటే టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక బౌండ‌రీలు బాదిన రికార్డు క్రిస్‌గేల్ పేరిట ఉంది. అత‌డు 2196 బౌండ‌రీలు బాదాడు. ఇంగ్లాండ్ మాజీ ఓపెన‌ర్ అలెక్స్ హేల్స్ 1855 బౌండ‌రీల‌తో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్ 1673 బౌండ‌రీల‌తో మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

టీ20 క్రికెట్‌లో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాళ్లు..

క్రిస్ గేల్ – 2196

అలెక్స్ హేల్స్ – 1855

డేవిడ్ వార్నర్ – 1673

కీరన్ పొలార్డ్ – 1670

ఆరోన్ ఫించ్ – 1557

రోహిత్ శర్మ – 1508

Virender Sehwag : విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేట్ పై వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్ల న‌ష్టానికి 234 ప‌రుగులు చేసింది. ముంబై బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ‌(27 బంతుల్లో 49), ఇషాన్ కిష‌న్ (23 బంతుల్లో 42), టీమ్‌డేవిడ్ (21 బంతుల్లో 45నాటాట్‌), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39) లు రాణించారు. భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 205 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ట్రిస్టన్ స్టబ్స్ (71 నాటౌట్‌; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), పృథ్వీ షా (66; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3సిక్స‌ర్లు) పోరాడినా ఓట‌మి త‌ప్ప‌లేదు.

ట్రెండింగ్ వార్తలు