IPL 2025: అట్లుంటది మరీ.. రోహిత్ శర్మ మరో మైలురాయి.. హిట్ మ్యాన్ రికార్డు

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ప్రయాణం 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో ప్రారంభమైంది.

@BCCI

రోహిత్ శర్మ తన క్రికెట్‌ కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్‌ మూడో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ ఆడిన 258వ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌ చెన్నైలోపి ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఎమ్మెస్‌ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 265 మ్యాచులు ఆడాడు. ఆ జాబితాలో మూడో ఆటగాడిగా దినేశ్ కార్తీక్ (257 మ్యాచ్‌లు) ఉన్నాడు.

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ప్రయాణం 2008లో డెక్కన్ ఛార్జర్స్‌తో ప్రారంభమైంది. అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌ అయ్యాడు. ఆ టీమ్‌కు ఐదుసార్లు ఐపీఎల్‌ టైటిళ్లను అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. రోహిత్‌ శర్మ ఇంతకుముందు జరిగిన 17 సీజన్లలో 29.72 సగటుతో 2 సెంచరీలతో 6,628 పరుగులు చేశాడు.

Also Read: ఆరెంజ్‌ ఆర్మీ అదరహో.. రాజస్థాన్‌ రాయల్స్‌పై ఇలా గెలిచింది..

అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడింది వీళ్లే..

  • ఎమ్మెస్‌ ధోనీ ( 2008-2025) 265 మ్యాచులు, 5243 పరుగులు
  • రోహిత్ శర్మ (2008-2025) 258 మ్యాచులు, 6628 పరుగులు
  • దినేశ్ కార్తీక్ (2008-2024) 257 మ్యాచులు, 4842 పరుగులు
  • కోహ్లీ (2008-2025) 253 మ్యాచులు, 8063 పరుగులు
  • రవీంద్ర జడేజా (2008-2025) 241 మ్యాచులు, 2959 పరుగులు
  • ధావన్ (2008-2024) 222 మ్యాచులు, 6769 పరుగులు
  • రవిచంద్రన్ అశ్విన్ (2009-2025) 213 మ్యాచులు, 800 పరుగులు
  • రైనా (2008-2021) 205 మ్యాచులు, 5528 పరుగులు
  • ఉతప్ప (2008-2022) 205 మ్యాచులు, 4952 పరుగులు
  • ఏటీ రాయుడు (2010-2023) 204 మ్యాచులు, 4348 పరుగులు
  • పీపీ చావ్లా (2008-2024) 192 మ్యాచులు, 624 పరుగులు
  • పొలార్డ్ (2010-2022) 189 మ్యాచులు, 3412 పరుగులు
  • రహానే (2008-2025) 186 మ్యాచులు, 4698 పరుగులు
  • ఏబీ డివిలియర్స్ (2008-2021) 184 మ్యాచులు, 5162 పరుగులు
  • డేవిడ్ వార్నర్ (2009-2024 ) 184 మ్యాచులు, 6565 పరుగులు