SRH Vs RR: ఆరెంజ్ ఆర్మీ అదరహో.. రాజస్థాన్ రాయల్స్‌పై ఇలా గెలిచింది..
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 286/6 స్కోరు నమోదు చేసుకుంది.

Pic: ©ANI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో 286/6 స్కోరు నమోదు చేసుకుంది.
లక్ష్య ఛేదనలో ఆర్ఆర్ పోరాడి ఓడింది. 20 ఓవర్లలో 242/6 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ 44 పరుగులతో గెలిచింది.
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 1, సంజూ శాంసన్ 66, రియాన్ పరాగ్ 4, నితీశ్ రాణా 11, ధ్రువ్ జురెల్ 70, షిమ్రాన్ హెట్మెయర్ 42, శుభం దుబే 34 (నాటౌట్), జోఫ్రా 1 (నాటౌట్) పరుగులు తీశారు.
ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్ రెండు వికెట్ల చొప్పున, మొహమ్మద్ షమీ, ఆడం జంపా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
ఇక అంతకుముందు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 24 (11 బంతులు, 5 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (31 బంతులు, 3 సిక్సులు, 9 ఫోర్లు), నితీశ్ కుమార్ రెడ్డి 30 (15 బంతులు, ఒక సిక్స్, 4 ఫోర్లు), ఇషాన్ కిషన్ 106 నాటౌట్ (47 బంతులు, 6 సిక్సులు, 11 ఫోర్లు), అంకిత్ వర్మ 7 (3 బంతులు, ఒక సిక్స్), అభినవ్ మనోహర్ (డకౌట్) పరుగులు చేయగా, పాట్ కమ్మిన్స్ (0) నాటౌట్‌గా నిలిచాడు. ఆర్ఆర్ బౌలర్లలో తుషార్‌కు 3, మనీశ్ తీక్షణకు 2, జోఫ్రా అర్చర్‌కు ఓ వికెట్ దక్కాయి.
కాగా, ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్‌ను నమోదు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదైన మొదటి మూడు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టే ఉంది.