మరోసారి ఎస్‌ఆర్‌హెచ్‌ వీర బాదుడు.. ఐపీఎల్‌ చరిత్రలోనే సెకండ్‌ హయ్యెస్ట్‌ స్కోర్.. ఫుల్‌ లిస్ట్‌ చూడండి..

ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287/3తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మరోసారి ఎస్‌ఆర్‌హెచ్‌ వీర బాదుడు.. ఐపీఎల్‌ చరిత్రలోనే సెకండ్‌ హయ్యెస్ట్‌ స్కోర్.. ఫుల్‌ లిస్ట్‌ చూడండి..

Ishan Kishan Pic: ©ANI

Updated On : March 23, 2025 / 6:01 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌ మరోసారి రెచ్చిపోయింది. ఐపీఎల్‌ చరిత్రలోనే సెకండ్‌ హయ్యెస్ట్‌ స్కోర్‌ను నమోదు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదైన మొదటి మూడు స్థానాల్లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టే ఉంది.

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోరు.

ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287/3తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ.. ముంబై ఇండియన్స్‌పై 277/3 స్కోరు చేసింది.

Also Read: ఉప్పల్‌ మ్యాచ్‌లో భారీ స్కోర్.. ఐపీఎల్‌ 2025లో మొట్టమొదటి సెంచరీ.. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఇషాన్, ట్రావిస్ హెడ్

అత్యధిక స్కోర్లు ఇవే

  • SRH 287/3 v RCB (బెంగళూరు మ్యాచ్‌లో) 2024, ఏప్రిల్ 15
  • SRH 286/6 v RR (హైదరాబాద్) 2025, మార్చి 23
  • SRH 277/3 v MI (హైదరాబాద్) 2024, మార్చి 27
  • KKR 272/7 v DC (విశాఖపట్నం) 2024, ఏప్రిల్ 3
  • SRH 266/7 v DC (ఢిల్లీ) 2024, ఏప్రిల్ 20
  • RCB 263/5 v వారియర్స్ (బెంగళూరు) 2013, ఏప్రిల్ 23
  • Punjab Kings 262/2 v KKR (ఈడెన్ గార్డెన్స్) 2024, ఏప్రిల్ 26
  • RCB 262/7 v SRH (బెంగళూరు)2024, ఏప్రిల్ 15
  • KKR 261/6 v పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్) 2024, ఏప్రిల్ 26
  • DC 257/4 v MI (ఢిల్లీ) 2024, ఏప్రిల్ 27
  • LSG 257/5 v పంజాబ్ కింగ్స్ (మొహాలి) 2023, ఏప్రిల్ 28