Rohit Sharma : ఐదో టెస్టుకు ముందు కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే..

ధ‌ర్మ‌శాల టెస్టుకు ముందు హిట్‌మ్యాన్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది.

Rohit Sharma

IND vs ENG – Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌ల‌తో బౌల‌ర్ల‌కు ఎన్నో నిద్ర‌లేని రాత్రుళ్లు మిగిల్చాడు. రోహిత్ చాలా అల‌వోక‌గా సిక్స‌ర్లు బాదేస్తుంటాడు. అత‌డు కొట్టే సిక్స‌ర్ల‌ను చూసి తీరాల్సిందే. కాగా.. ధ‌ర్మ‌శాల టెస్టుకు ముందు హిట్‌మ్యాన్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో మ‌రో ఆరు సిక్స‌ర్లు బాదితే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి) 600 సిక్స‌ర్లు కొట్టిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. మూడు ఫార్మాట్ల‌లో 471 మ్యాచ్‌లు ఆడిన శ‌ర్మ 594 సిక్స‌ర్లు కొట్టాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే..

రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 594
క్రిస్‌ గేల్ (వెస్టిండీస్‌) – 553
షాహిద్‌ అఫ్రిది (పాకిస్తాన్‌) – 476,
మార్టిన్‌ గప్తిల్ (న్యూజిలాండ్‌) – 398,
మ‌హేంద్ర సింగ్ ధోని (భార‌త్‌) – 383,
స‌న‌త్ జయసూర్య (శ్రీలంక‌) – 359,
ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) – 352,
ఏబీ డివిలియర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 346,
జోస్‌ బట్లర్ (ఇంగ్లాండ్‌) – 328

WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో డీఆర్ఎస్ వివాదం.. లెగ్ స్పిన్నర్ గూగ్లీగా!

ఒక్క సిక్స్ కొడితే..

రోహిత్ శ‌ర్మ‌ను మ‌రో రికార్డు ఊరిస్తోంది. ధ‌ర్మ‌శాల టెస్టులో రోహిత్ శ‌ర్మ క‌నీసం ఒక్క సిక్స‌ర్ బాదినా చాలు ఓ అరుదైన రికార్డు అత‌డి ఖాతాలో వ‌చ్చి చేరుతుంది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ)లో 50 సిక్స‌ర్లు కొట్టిన మొద‌టి భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ సొంతం చేసుకుంది. దీంతో మార్చి 7 నుంచి ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టెస్టు మ్యాచ్ నామ‌మాత్రంగా మారింది. అయితే.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే ప్ర‌తీ టెస్టు మ్యాచ్‌లో గెల‌వ‌డం ఎంతో ముఖ్యం. ఈ నేప‌థ్యంలో ఈ మ్యాచ్‌ను భార‌త్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది.

PSL : చిన్నా నువ్వు మాత్రం గ్రౌండ్‌లోకి రాకు.. వ‌చ్చావో బ్యాట‌ర్ల వెన్నులో వ‌ణుకే..!

ట్రెండింగ్ వార్తలు