Rohit Sharma : కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు.. సిక్స‌ర్ల కింగ్..

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

Rohit Sharma shatters Eoin Morgan world record for sixes in international cricket

Rohit Sharma – Eoin Morgan : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మొద‌టి వ‌న్డే మ్యాచ్‌లోనూ అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్‌కు మంచి ఆరంభం అందించాడు. మంద‌కొడి పిచ్‌పైనా చెల‌రేగాడు. 47 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 58 ప‌రుగ‌లు చేశాడు. ఈ క్ర‌మంలో రోహిత్ శ‌ర్మ ప‌లు రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన కెప్టెన్లు..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రికార్డును బ్రేక్ చేశాడు. కెప్టెన్‌గా మోర్గాన్ 180 ఇన్నింగ్స్‌ల‌లో 233 సిక్స్‌లు బాద‌గా.. రోహిత్ కేవ‌లం 134 ఇన్నింగ్స్‌ల‌లోనే 234 సిక్స్‌లు కొట్టేశాడు. వీరిద్ద‌రి త‌రువాత ఎంఎస్ ధోని, రికీ పాంటింగ్‌లు ఉన్నారు.

Rohit Sharma : తొలి వ‌న్డేలో దీన్ని గ‌మ‌నించారా..? గ్రౌండ్‌లోనే వాషింగ్ట‌న్ సుంద‌ర్ పై రోహిత్ సీరియ‌స్‌..

కెప్టెన్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు..

* రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 134 ఇన్నింగ్స్‌ల్లో 234 సిక్స‌ర్లు..
* ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్‌) – 180 ఇన్నింగ్స్‌ల్లో 233 సిక్స‌ర్లు..
* ఎంఎస్ ధోని (భార‌త్‌) – 330 ఇన్నింగ్స్‌ల్లో 211 సిక్స‌ర్లు..
* రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 376 ఇన్నింగ్స్‌ల్లో 171 సిక్స‌ర్లు
* బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ (న్యూజిలాండ్‌) – 140 ఇన్నింగ్స్‌ల్లో 170 సిక్స‌ర్లు..

ఓపెన‌ర్‌గా 15వేల ప‌రుగులు..

ఓపెన‌ర్‌గా రోహిత్ శ‌ర్మ 15వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 15వేల ప‌రుగులు చేసిన రెండో ఓపెన‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. స‌చిన్ 331 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించ‌గా.. రోహిత్ 352 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్నాడు.

Arshdeep Singh : తోపు బ్యాట‌ర్‌లా షాట్‌కు వెళ్లావా..! అర్ష్‌దీప్ సింగ్ పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 47.5 ఓవ‌ర్ల‌లో సరిగ్గా 230 ప‌రుగులు చేసి ఆలౌటైంది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది.