Rohit Sharma-Aakash Chopra
Rohit Sharma-Aakash Chopra : బెంగళూరు వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత మజాను ఇచ్చింది. అయితే.. ఈ మ్యాచులో రోహిత్ శర్మ తీసుకున్న ఓ నిర్ణయం పై సరికొత్త చర్చ ప్రారంభమైంది. రెండో సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు వెళ్లడాన్ని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తప్పుబడ్డాడు. భారత జట్టు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిందని, అంపైర్ల తప్పిదం కూడా అఫ్గానిస్తాన్ కొంపముంచాయని అతడు చెప్పుకొచ్చాడు. మ్యాచ్ సమయంలోనూ తాను ఈ విషయాను చెప్పానన్నాడు.
తన యూట్యూబ్ ఛానెలో అతడు ఈ విధంగా మాట్లాడాడు. మొదటి సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నప్పటికీ రెండో సూపర్ ఓవర్‌లో అతడిని ఆడించడం రూల్స్‌కు వ్యతిరేకమన్నాడు. ‘అతడు రిటైర్డ్ ఔట్ అయ్యాడు. అలా కాకుండా రిటైర్డ్ హర్ట్ అయితే మళ్లీ బ్యాటింగ్ చేయొచ్చు. గ్రౌండ్‌లో గాయపడిన సందర్భాల్లో రిటైర్డ్ హర్ట్‌గా వెళితే మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
Telugu Titans : సినీ నటుడు బాలకృష్ణ నివాసంలో తెలుగు టైటాన్స్ ఆటగాళ్ల సందడి..
రిటైర్డ్ ఔట్ అయితే మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఇక రోహిత్ మొదటి సూపర్ ఓవర్‌లో రిటైర్డ్ ఔట్‌గా వెళ్లినప్పుడు తాను కామెంట్రీ చేస్తున్నట్లు చెప్పాడు.’ ఆ సమయంలో అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రాలేడని చెప్పాను. ఎందుకంటే అతడు ఔట్ అయ్యాడు కాబట్టి. అయితే.. రెండో సూపర్‌లో రోహిత్, రింకూ సింగ్‌లు బ్యాటింగ్‌కు వచ్చారు. ఇది చాలా తప్పు. రిటైర్డ్ ఔట్‌గా వెళ్లిన రోహిత్ మళ్లీ బ్యాటింగ్‌కు రావడం రూల్స్‌కు విరుద్దం .’అని చోప్రా అన్నాడు.
సంజు శాంసన్ వస్తాడని అనుకోలేదు..
ఇక రెండో సూపర్ ఓవర్‌లో రింకూ సింగ్ ఔటైన తరువాత శివమ్ దూబె వస్తాడని తాను అనుకున్నానని అయితే సంజు శాంసన్‌ను పంపడం తనను పెద్ద షాక్‌కు గురి చేసిందని చోప్రా చెప్పాడు. నేను సంజుకు వ్యతిరేకం కాదు. అయితే.. ఈ మ్యాచ్‌లో అతడు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అందుకనే శివమ్ దూబెను పంపించాల్సింది. అప్పుడు లెఫ్టార్మ్ బౌలర్ ఫరీద్ అహ్మద్ వేస్తున్నాడు. అతడి బౌలింగ్‌ను దూబె చాలా చక్కగా ఆడతాడు. ఇక భారత్ 11 పరుగులు చేయడంతో ఆశ్చర్యపోయా.. మన వాళ్లు ఆరు బంతులు కూడా ఆడలేదు. అంటూ ఐదు బంతుల్లోనే రెండో సూపర్ ఓవర్ ముగియడాన్ని చోప్రా ప్రస్తావించాడు.
Suryakumar Yadav : హాస్పిటల్ బెడ్ పై సూర్యకుమార్ యాదవ్.. ఎందుకంటే..?