Rohit Sharma : ఓ వైపు భార‌త్ ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే.. మ‌రోవైపు రోహిత్ శ‌ర్మ‌ ఎంచ‌క్కా..

టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న కుటుంబంతో ముంబై ఎయిర్‌పోర్టులో క‌నిపించాడు

Rohit Sharma spotted in Mumbai airport ahead of ENG vs IND 2025 Tests

భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. మ‌రోవైపు టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న కుటుంబంతో ముంబై ఎయిర్‌పోర్టులో క‌నిపించాడు.

టీ20ల‌తో పాటు టెస్టుకు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌డంతో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు రోహిత్ శ‌ర్మ వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం త‌న‌కు దొరికిన విరామాన్ని రోహిత్ శ‌ర్మ స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు. త‌న కుటుంబంతో స‌ర‌దాగా గ‌డుపుతున్నాడు. భార్య రితికా సజ్దే, కూతురు సమైరా, కొడుకు అహాన్‌లతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో శుక్ర‌వారం రోహిత్ శ‌ర్మ క‌నిపించాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భార‌త కాల‌మానం ప్ర‌కారం లంచ్‌, టీ, సెష‌న్ల స‌మ‌యాలు ఇవే..

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రోహిత్ కుమారుడు అహాన్ ను చూసిన అభిమానులు అచ్చం నాన్న‌లాగే ఉన్నాడ‌ని అంటున్నారు. కాగా.. రోహిత్ శ‌ర్మ ఎక్క‌డ‌కు వెలుతున్నాడు అన్న సంగ‌తి తెలియాల్సి ఉంది.

38 ఏళ్ల రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కేవ‌లం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. త‌దుప‌రి అత‌డు టీమ్ఇండియా త‌రుపున ఆగ‌స్టులోనే మైదానంలో అడుగుపెట్ట‌నున్నాడు. ఆగ‌స్టులో భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో భాగంగా తొలి వ‌న్డే ఆగ‌స్టు 17న జ‌ర‌గ‌నుంది.

Vitality T20 Blast : ఇదెక్క‌డి వింత‌రా బాబు.. ఎండ కార‌ణంగా మ్యాచ్ ఆగిపోయిందా!

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ శర్మ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.