ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భార‌త కాల‌మానం ప్ర‌కారం లంచ్‌, టీ, సెష‌న్ల స‌మ‌యాలు ఇవే..

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై ర‌స‌వ‌త్త‌ర టెస్టు స‌మ‌రానికి వేళైంది.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భార‌త కాల‌మానం ప్ర‌కారం లంచ్‌, టీ, సెష‌న్ల స‌మ‌యాలు ఇవే..

ENG vs IND 1st Test session timings details here

Updated On : June 20, 2025 / 2:36 PM IST

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై ర‌స‌వ‌త్త‌ర టెస్టు స‌మ‌రానికి వేళైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్ర‌వారం నుంచి భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే రెండు జ‌ట్లు స్టేడియానికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌లో ఘ‌నంగా బోణీ కొట్టాల‌ని భావిస్తున్నాయి. ఇక ఇరు జ‌ట్ల‌కు ఈ సిరీస్‌తోనే ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ ) 2025-27 సైకిల్‌ ప్రారంభం కానుంది.

సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్ లు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు ఎలా రాణిస్తుంద‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.

ENG vs IND : భార‌త్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా మ్యాచ్‌ల‌ను ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

ఇక తొలి టెస్టు మ్యాచ్ భార‌త కాల‌మానం ప్ర‌కారం 3.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. టాస్‌ను 3.00 గంట‌ల‌కు వేయ‌నున్నారు. ఇక తొలి సెష‌న్ ఎప్పుడు, లంచ్ విరామం, టీ సెష‌న‌ల్ వంటి వివ‌రాల‌ను ఇప్పుడు చూద్దాం..

తొలి సెష‌న్ – మ‌ధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు
లంచ్ విరామం – సాయంత్రం 5.30 గంట‌ల నుంచి 6.10 వ‌ర‌కు
రెండో సెష‌న్ – సాయంత్రం 6.10 గంట‌ల నుంచి రాత్రి 8.10 వ‌ర‌కు
టీ విరామం – రాత్రి 8.10 నుంచి రాత్రి 8.30 వ‌ర‌కు
మూడో సెష‌న‌ల్ – రాత్రి 8.30 నుంచి రాత్రి 10.30 వ‌ర‌కు

ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. ధోని ప్ర‌పంచ రికార్డు పై రిష‌బ్ పంత్ క‌న్ను..

ఇక ఈ మ్యాచ్‌కు రెండు రోజుల ముందే ఇంగ్లాండ్ త‌మ తుది జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఇంగ్లాండ్ తుదిజట్టు ఇదే..
జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.