ENG vs IND : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. ధోని ప్రపంచ రికార్డు పై రిషబ్ పంత్ కన్ను..
మూడోసారి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ అరుదైన ఘనత పై కన్నేశాడు.

ENG vs IND Rishabh Pant Needs 289 Runs to break MS Dhoni World Record
ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. మూడోసారి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ అరుదైన ఘనత పై కన్నేశాడు. ఇంగ్లాండ్ గడ్డ పై పంత్ మరో 267 పరుగులు సాధిస్తే సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.
ఇంగ్లాండ్ గడ్డ పై పర్యాటక వికెట్ కీపర్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పంత్ నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ధోని పేరిట ఉంది. ఇంగ్లాండ్‌లో ధోని 778 పరుగులు సాధించాడు. ఇక పంత్ ఎనిమిది టెస్టుల్లో 511 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పంత్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్ ఐదు టెస్టులు ఆడనుంది. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోనే ధోని రికార్డును పంత్ ను అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రిషభ్ పంత్ టీమ్ఇండియా తరఫున ఇప్పటి వరకు 43 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 42.1 సగటుతో 2948 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 అర్థశతకాలు ఉన్నాయి. మరో 52 పరుగులు చేస్తే అతడు టెస్టుల్లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
Vitality T20 Blast : ఇదెక్కడి వింతరా బాబు.. ఎండ కారణంగా మ్యాచ్ ఆగిపోయిందా!
ఇంగ్లాండ్‌లో అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్ల వికెట్ కీపర్లు వీరే..
* మహేంద్ర సింగ్ ధోని (భారత్) – 778 పరుగులు
* రోడ్నీ మార్ష్ (ఆస్ట్రేలియా) – 773 పరుగులు
* జాన్ హెన్రీ (దక్షిణాఫ్రికా) – 684 పరుగులు
* ఇయాన్ హేలీ (ఆస్ట్రేలియా) – 624 పరుగులు
* జెఫ్రీ డుజాన్ (వెస్టిండీస్) – 604 పరుగులు
* ఫారూఖ్ ఇంజనీర్ (భారత్) – 563 పరుగులు
* ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) – 521 పరుగులు
* బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా) – 513 పరుగులు
* రిషభ్ పంత్ (భారత్) – 511 పరుగులు