IND vs ENG 2nd Test : రోహిత్ శర్మ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ స్లిప్ లో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

Rohit Sharma

Rohit Sharma : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగ్గా.. టీమిండియా ఓటమి పాలైంది. రెండో మ్యాచ్ విశాఖ పట్టణంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ కలిపి భారత్ జట్టు ఇంగ్లాండ్ కు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో ఆదివారం (మూడోరోజు ఆట) ఇంగ్లాండ్ జట్టు ఒక వికెట్ నష్టపోయి 67 పరుగులు చేసింది. 316 పరుగుల లక్ష్యంతో నాల్గోరోజు ఆటను ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రారంభించారు.

Also Read ; ఇంగ్లండ్ మ్యాచ్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే.. భారత్‌ గడ్డపై ఇప్పటివరకు అలా జరగలేదు! గణాంకాలు ఇవే..

నాల్గోరోజు భారత్ ఫేసర్ బుమ్రా కట్టుదిట్టమైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మరోవైపు స్పిన్ బౌలింగ్ తో అశ్విన్ అదరగొట్టాడు. అశ్విన్ వేసిన బౌలింగ్ లో (28.2వ ఓవర్) ఓలీ పోప్ ఔట్ అయ్యాడు. ఓలీ డిఫెన్స్ ఆడే క్రమంలో బాల్ కాస్త బ్యాట్ కు తగిలి స్లిప్ పైనుంచి బౌండరీ వెళ్లేలా ప్రయత్నం జరిగింది. స్లిప్ లో ఫీల్డింగ్ లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వేగంగా బాల్ ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.