Rohit Sharma : తొలి టెస్టుకు ముందు రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ ఆడితే..

మ‌రికొన్ని గంట‌ల్లో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు స‌మ‌రం ఆరంభం కానుంది.

Rohit Sharma

Rohit Sharma : మ‌రికొన్ని గంట‌ల్లో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు స‌మ‌రం ఆరంభం కానుంది. గురువారం హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు మొద‌టి టెస్టు మ్యాచులో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ.. ఇంగ్లాండ్ బ‌బ్‌జాల్ గేమ్‌, కోహ్లీ గైర్హాజ‌రు, టెస్టు కోసం భార‌త జ‌ట్టు స‌న్న‌ద్ద‌త వంటి విష‌యాల పై మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్‌లో భార‌త్ త‌ప్ప‌క విజ‌యం సాధిస్తామ‌న్న ధీమాను వ్య‌క్తం చేశాడు.

గ‌త కొంత‌కాలంగా టెస్టుల్లో ఇంగ్లాండ్ జ‌ట్టు బ‌జ్‌బాల్ గేమ్‌ను ఆడుతూ ప్ర‌త్య‌ర్థుల‌ను ఒత్త‌డిలోకి నెడుతూ విజ‌యాన్ని సాధిస్తోంది. దీనిపై రోహిత్ మాట్లాడుతూ.. దాని గురించి పెద్ద‌గా ఆలోచించ‌డం లేద‌న్నాడు. ఎవ్వ‌రు ఎలా ఆడినా స‌రే మ‌న గేమ్‌ను మ‌నం ఆడాల్సిందేన‌ని చెప్పాడు. ఓ టీమ్‌గా మైదానంలో ఎలా ఉంటాము అన్న‌దే ముఖ్య‌మ‌న్నాడు. ఇక టెస్టు ఫార్మాట్‌లో ఆట‌గాళ్లకు అస‌లైన స‌వాళ్లు ఎదురు అవుతాయ‌ని చెప్పాడు. గ‌త కొంత‌కాలంగా భార‌త ఆట‌గాళ్లు నిల‌క‌డైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని తెలిపాడు. ఉప్ప‌ల్‌లో ప్ర‌త్యేక వ్యూహాల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు చెప్పాడు. ఇంగ్లాండ్ పై టెస్టు సిరీస్‌ను గెలుస్తామ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నాడు.

IND vs ENG : టీమ్ఇండియాను స‌వాల్ చేసిన‌ ఇంగ్లాండ్‌..! ఒక్క రోజు ముందుగానే.. అంత న‌మ్మ‌కం ఏంటో మ‌రీ..!

కోహ్లీ లేక‌పోవ‌డంతో..

భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో తొలి రెండు టెస్టుకు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్థానంలో యువ ఆట‌గాడు ర‌జ‌త్ పాటిదార్‌ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. విరాట్ లేని లోటు జ‌ట్టులో ఉంద‌న్నాడు. వాస్త‌వానికి కోహ్లీ స్థానంలో అనుభ‌వం ఉన్న ఆట‌గాళ్ల‌ను భ‌ర్తీ చేయాల‌ని అనుకున్న‌ట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు. అదే స‌మ‌యంలో యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కావాలు ఇవ్వాల‌ని భావించిన‌ట్లు వెల్ల‌డించాడు. యువ ఆట‌గాళ్ల‌కు నేరుగా విదేశాల్లో అవ‌కాశం ఇవ్వ‌కుండా స్వ‌దేశంలో ఇస్తే బాగుంటుద‌ని ఆలోచించిన‌ట్లు రోహిత్ చెప్పాడు. ఈ టెస్టు సిరీస్‌లో కుల్దీప్ యాద‌వ్ రాణిస్తాడ‌ని అనుకున్న‌ట్లు తెలిపాడు.

వీసా ఆఫీసులో లేను క‌దా..

ఇంగ్లాండ్ యువ ఆఫ్ స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ వీసా ఇబ్బందుల కార‌ణంగా మొద‌టి టెస్టు మ్యాచ్‌కు దూరం అయ్యాడు. దీనిపై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా రోహిత్ ఇలా స‌మాధానం ఇచ్చాడు. అత‌డికి ఇలా జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నాడు. దీనిపై పూర్తి స్థాయిలో వివ‌ర‌ణ ఇచ్చేందుకు తాను వీసా ఆఫీస్‌లో లేన‌ని, ఉండి ఉంటే ఖ‌చ్చితంగా స‌రైన స‌మాధానం ఇచ్చేవాడిన‌న్నారు. త్వ‌ర‌లోనే అత‌డి స‌మ‌స్య తీరి ఇంగ్లాండ్ జ‌ట్టుతో క‌లుస్తాడ‌నే అనుకుంటున్న‌ట్లు రోహిత్ అన్నాడు.

భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్.. ఉదయం 6.30 నుంచే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతి

ట్రెండింగ్ వార్తలు