Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో బుధవారం సిక్కింతో జరిగిన మ్యాచులో చెలరేగి ఆడిన స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. ఇవాళ ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచులో మాత్రం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మది ముంబై టీమ్ అన్న విషయం తెలిసిందే.
మొన్నటి మ్యాచులో రోహిత్ శర్మ 94 బంతుల్లోనే 155 పరుగులు బాదిన విషయం తెలిసిందే. నేటి మ్యాచులో క్రీజులోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయాడు. తొలి బంతికే క్యాచ్ ఇచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Also Read: వైభవ్ సూర్యవంశీకి ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ ప్రదానం.. మోదీతోనూ భేటీ..
మొన్నటి మ్యాచులో రోహిత్ శర్మ ఆడిన తీరుతో నేడు అతడిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే, ఇలా ఔట్ అవడం అభిమానులను నిరాశపర్చింది. రోహిత్ శర్మ అలసిపోయాడా? అతివిశ్వాసంతో ఆడాడా? లేక అతడి దురదృష్టమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జైపూర్ సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో ఉత్తరాఖండ్‌తో జరిగిన గ్రూప్ సీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయినప్పటికీ ఇతర బ్యాటర్లు రాణించడంతో ముంబై స్కోరు 50 ఓవర్లకు 331/7గా నమోదైంది.
Rohit Sharma’s catch was almost dropped by the fielder, but he held on to it on the second attempt.😢💔 pic.twitter.com/Fcb1965xfW
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) December 26, 2025