వైభవ్‌ సూర్యవంశీకి ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’ ప్రదానం.. మోదీతోనూ భేటీ..

ఈ పురస్కారం అందుకున్న వైభవ్‌కి బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది.

వైభవ్‌ సూర్యవంశీకి ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌’ ప్రదానం.. మోదీతోనూ భేటీ..

Updated On : December 26, 2025 / 2:36 PM IST

Vaibhav Suryavanshi: టాలెంట్‌కు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (14) ఇవాళ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందుకున్నాడు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్‌ ఈ పురస్కారాన్ని తీసుకున్నాడు.

చిన్న వయసులోనే క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో వైభవ్‌ సూర్యవంశీ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అంటే 5-18 ఏళ్ల పిల్లల అసాధారణ ప్రతిభను గుర్తించే జాతీయ పౌర గౌరవం. ఈ పురస్కారం అందుకున్న వైభవ్‌కి బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది.

ఐపీఎల్‌ 2025లో 35 బాల్స్‌లోనే సెంచరీ సాధించి వైభవ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున అతడు ఐపీఎల్‌లో ఆడి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్నాడు. ఐపీఎల్‌ అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగానూ వైభవ్ నిలిచాడు. బిహార్‌కు చెందిన ఈ యంగ్ క్రికెటర్ ఇంత చిన్న వయసులో విధ్వంసకర బ్యాటర్‌ అనిపించుకుంటున్నాడు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడంతో వైభవ్.. విజయ్ హజారే ట్రోఫీ మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఈ మ్యాచులను కోల్పోతున్నప్పటికీ వైభవ్‌కు ఈ పురస్కారం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. వైభవ్ చిన్న వయసులోనే సంచలనాలు సృష్టిస్తున్నాడు.

వైభవ్ సహా ఇతర పురస్కార గ్రహీతలు ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశం ఇతరులకు ప్రేరణగా నిలవనుంది.

అవార్డులు అందుకున్న బాలలు వీరే..

ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను ఎందుకు ఇస్తారు?
అసాధారణ ప్రతిభ కనబర్చే పిల్లలకు ఇచ్చే అత్యున్నత పౌర గౌరవమే ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌. 5-18 ఏళ్ల వయసు ఉండే అత్యంత ప్రతిభావంతులకు ప్రతి ఏడాది ఈ పురస్కారం అందజేస్తారు.

ఏయే రంగాల్లో ప్రతిభ కనబర్చితే ఇస్తారు?

  • ధైర్యసాహసాలు
  • కళలు, సంస్కృతి
  • పర్యావరణం
  • ఆవిష్కరణ
  • విజ్ఞానం, సాంకేతికత
  • సామాజిక సేవ
  • క్రీడలు