Romario Shepherd : ఆఖ‌రి ఓవ‌ర్‌లో పెను విధ్వంసం పై షెఫ‌ర్డ్.. ప్ర‌తీ బంతిని..

ముంబై విజ‌యంలో రొమారియో షెఫ‌ర్డ్ కీల‌క పాత్ర పోషించాడు.

Romario Shepherd opens up on record knock vs DC

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ గెలుపు బోణీ కొట్టింది. ఆదివారం వాంఖడే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 29 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ ఓట‌ముల త‌రువాత ముంబైకి ఇదే మొద‌టి గెలుపు. ముంబై విజ‌యంలో రొమారియో షెఫ‌ర్డ్ కీల‌క పాత్ర పోషించాడు. కేవ‌లం 10 బంతులు ఎదుర్కొన్న అత‌డు 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 39 ప‌రుగులు చేశాడు.

నోకియా వేసిన ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 4,6,6,6,4,6 బాది ఏకంగా 32 ప‌రుగులు రాబ‌ట్టి ముంబై భారీ స్కోరు చేయ‌డంలో సాయం చేశాడు. మ్యాచ్ అనంత‌రం త‌న ఇన్నింగ్స్ పై షెఫ‌ర్డ్ స్పందించాడు. ముంబై అభిమానుల మ‌ద్ద‌తు అద్భుతం అని చెప్పాడు. ఇన్నాళ్ల క‌ష్టానికి ప్ర‌తి ఫ‌లం ఇది అని అన్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించాన‌ని చెప్పాడు.

Rohit Sharma : ఐపీఎల్ 2024లో ముంబై తొలి విజ‌యం.. రోహిత్ శ‌ర్మ మూడు ప‌దాల పోస్ట్ వైర‌ల్‌..

డెత్ ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్ ఎంతో కీల‌క‌మ‌న్నాడు. ప్ర‌తి బాల్‌ను కొట్టాల‌నే స్ప‌ష్ట‌మైన మైండ్ సెట్‌తో బరిలోకి దిగిన‌ట్లు వెల్ల‌డించాడు. టిమ్ డేవిడ్‌తో బ్యాటింగ్ చేయ‌డం బాగుంద‌ని, హిట్టింగ్ చేయ‌మ‌ని అత‌డే చెప్పాడ‌న్నారు. గ్రౌండ్‌లో ఒక వైపే ప‌రుగులు చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని, బంతిని బౌండ‌రీకి త‌ర‌లించాలంటే చాలా బ‌లం కావాల‌న్నాడు. త‌న బ‌లానికి కార‌ణం మంచిగా తిన‌డ‌మేన‌ని అన్నాడు.

అత‌డి వ‌ల్లే గెలిచాం.. హార్దిక్

ఎట్ట‌కేల‌కు విజ‌యం సాధించాం. ఇందుకోసం ఎంతో శ్ర‌మించాం. వ్యూహాత్మ‌క మార్పులు చేసుకుంటూ మ్యాచ్ పై ప‌ట్టు సాధించాం. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్ర‌తి ఒక్క ఆట‌గాడికి మ‌ద్దతు ఉంటుంద‌ని చెప్పాడు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో 70 కంటే ఎక్కువ ప‌రుగులు సాధించామ‌న్నాడు. ఆఖ‌రి ఓవ‌ర్ షెఫ‌ర్డ్ బారీ హిట్టింట్ చేశాడ‌ని, ఢిల్లీతో మ్యాచ్‌లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌మే కీల‌క‌మ‌న్నాడు. అత‌డే గెలిపించాడ‌న్నారు.

IPL 2024 Points Table : ముంబై అంటే అంతే మ‌రీ.. ఒక్క విజ‌యం.. పాయింట్ల ప‌ట్టిక‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు

ట్రెండింగ్ వార్తలు