RCB vs PBKS : కోహ్లీ విజృంభణ.. బెంగళూరు బోణీ.. 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై విజయం

RCB vs PBKS : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.

Royal Challengers Bengaluru beat Punjab Kings by 4 wickets

RCB vs PBKS : ఐపీఎల్‌ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (77; 49బంతుల్లో) విజృంభణతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బోణీ కొట్టింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

బెంగళూరు ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో విధ్వంసర బ్యాటింగ్‌ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మిగతా ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ (28), మణిపాల్ లామ్రార్ (17), రాజత్ పటిదార్ ( 18), అనుజ్ రావత్ (11) పరుగులు చేయగా, గ్లెన్ మ్యాక్స్ వెల్ (3), కెమరన్ గ్రీన్ (3), డు ప్లెసిస్ (3) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్, రబడా తలో రెండు వికెట్లు తీయగా, సామ్ కరన్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.

Bengaluru beat Punjab Kings

శిఖర్ ధావన్ టాప్ స్కోరు :
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్‌ ధావన్‌(45; 37 బంతుల్లో) అద్భుతంగా రాణించాడు. మిగతా పంజాబ్ ఆటగాళ్లలో ప్రభసిమ్రాన్ సింగ్ (25), జితేష్ శర్మ (27), సామ్ కరన్ (23), శశాంక్ సింగ్ (21), లియామ్ లివింగ్ స్టోన్ (17) పర్వాలేదనిపించారు.

జాన్ బెయిర్ స్టో (8), హర్ ప్రీత్ బ్రార్ (2) సింగిల్ డిజిట్‌కే చేతులేత్తేశారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, యశ్ దయాళ్, అల్జారీ జోసెఫ్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

Read Also : IPL 2024 : స్టేడియంలో కొట్టుకుంది రోహిత్, హార్ధిక్ ఫ్యాన్సేనా..! అసలు విషయం ఏమిటంటే? వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు