Royal challengers bengaluru Makara Sankranti wishes poster viral
RCB : మకర సంక్రాంతి (జనవరి 15) ని పురస్కరించుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ‘మధురానుభూతులు, ఆప్యాయత, నూతన ప్రారంభాలతో నిండిన ఆనందకరమైన, సంపన్నమైన మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.’ అంటూ పురుషుల, మహిళల ఆర్‌సీబీ (RCB) జట్లలోని పలువురు స్టార్ ప్లేయర్లతో కూడిన పోస్టర్‌తో ఆర్‌సీబీ విషెస్ చెప్పింది.
ఈ పోస్టర్‌లో ఆర్‌సీబీ ఐపీఎల్ స్టార్లు విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్ లు పంచెకట్టెలో కనిపిస్తుండగా.. డబ్ల్యూపీఎల్ స్టార్లు స్మృతి మంధాన, శ్రేయాంక పాటిల్ లు చీరలో ఉన్నారు. ఇది ఏఐ జనరేటెడ్ పిక్ అయినప్పటికి కూడా ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
IND vs NZ : ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు మరో షాక్..
రజత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 విజేతగా నిలిచింది. డబ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన నాయకత్వంలో ఆర్‌సీబీ 2024లో కప్పును ముద్దాడింది. ఇక ఈ ఏడాది రెండు జట్లు కప్పే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి.
IND vs NZ : మేము ఎలా గెలిచామో తెలుసా.. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్ వైరల్
ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూపీఎల్ లో ఆర్‌సీబీ దూసుకుపోతుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇదే జోష్‌లో రెండో సారి డబ్ల్యూపీఎల్ విజేతగా ఆర్‌సీబీ నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.