PIC: @RCBTweets
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ చండీగఢ్‌లో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు ధాటిగా ఆడారు. ఫిలిప్ సాల్ట్ 1, విరాట్ కోహ్లీ 73 (నాటౌట్), పటిక్కల్ 61, రజత్ పటీదార్ 12, జితేశ్ శర్మ 11 రన్స్ బాదారు. దీంతో ఆ జట్టు స్కోరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159గా నమోదైంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, హర్పీత్, చాహల్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
పంజాబ్ కింగ్స్ జట్టు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెర్), జోష్ ఇంగ్లిస్ , నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యష్ దయాల్