GT vs RCB: 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనవిజయం

జాక్స్‌ 100 పరుగులు, కోహ్లీ 70 పరుగులు బాది అజేయంగా నిలిచారు.

అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్రస్తుత ఐపీఎల్‌లో బెంగళూరు మూడో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది.

లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. జాక్స్‌ 100 పరుగులు, కోహ్లీ 70 పరుగులు బాది అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రవి శ్రీనివాసన్‌ కు ఒక వికెట్‌ దక్కింది. ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 200-3 పరుగులు చేసింది.

గుజరాత్ టైటాన్స్ లో సాయి సుదర్శన్ 84, షారుక్ ఖాన్ 58, డేవిడ్ మిల్లర్ 26, వృద్ధిమాన్ సాహా 5, శుభ్‌మన్ గిల్ 16 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో స్వప్నిల్ సింగ్, సిరాజ్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీశారు.

గుజరాత్‌ జట్టు: సాహా, శుభ్‌మన్‌ గిల్, సాయి సుదర్శన్, మిల్లర్, ఒమర్జాయ్‌, తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

ఆర్సీబీ జట్టు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, విల్ జాక్స్, రజత్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్‌, సిరాజ్, యశ్ దయాల్

IPL 2024 : రిషబ్ పంత్‌కు బిగ్‌షాక్‌.. ఒక మ్యాచ్‌ నిషేధం తప్పదా.. ఎందుకంటే..?

ట్రెండింగ్ వార్తలు