IND vs SL : బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డుల్లో స‌ర్‌ప్రైజ్‌.. అనౌన్స్ చేసిన క్రికెట్ దిగ్గ‌జం.. ఎవ‌రికో తెలుసా..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది.

Best fielder award

India vs Sri Lanka : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా అద‌ర‌గొడుతోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతుంది. వ‌రుస‌గా ఏడు మ్యాచుల్లోనూ గెలిచి సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాల గురించి కాసేపు ప‌క్క‌న బెడితే ఫీల్డింగ్‌లో మెరుపు వేగంతో క‌దులుతున్నారు. క‌ష్ట‌త‌ర‌మైన ఒక‌టి రెండు మిన‌హా దాదాపు అన్ని క్యాచ్‌ల‌ను అందుకున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ముందు వ‌ర‌కు కాస్త పేల‌వంగా ఉన్న భార‌త ఫీల్డింగ్‌, మెగా టోర్నీలో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. దీని వెనుక బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్ విధాన‌మే కార‌ణం అని చెప్పొచ్చు.

మ్యాచులో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన ఆట‌గాళ్ల‌కు టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ ఈ మెడ‌ల్‌ను అందిస్తున్నారు. మెడ‌ల్స్ ఇవ్వ‌డంతోనే ఆగ‌ని మేనేజ్‌మెంట్ ఈ మెడ‌ల్ ఎవ‌రికి వ‌చ్చిందో చెప్పే విధానాన్ని ప్ర‌తిసారి మారుస్తుండ‌డం ప్లేయ‌ర్ల‌లో ఉత్సాహాన్ని పెంచింది. దీంతో ఈ మెడ‌ల్‌ను అందుకునేందుకు భార‌త ఆట‌గాళ్లు పోటీప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో త‌మ నైపుణ్యాల‌ను మొత్తం ప్ర‌ద‌ర్శించి ఫీల్డింగ్‌లో ఆక‌ట్టుకుంటున్నారు. అంతేనా మైదానంలో మంచి క్యాచ్ అందుకోగానే మెడ‌ల్ నాకే ఇవ్వాల‌నే సైగ‌లు చేస్తుండ‌డాన్ని చూడొచ్చు.

Tirumala : శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్

గురువారం వాంఖ‌డే వేదిక‌గా భార‌త జ‌ట్టు శ్రీలంక‌తో త‌ల‌ప‌డింది. 302 ప‌రుగుల భారీ తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డ‌ర్ ఎవ‌రు అని అంతా ఎదురుచూస్తుండ‌గా ఫీల్డింగ్ కోచ్ వ‌చ్చి మ్యాచులో ఆట‌గాళ్లు ప‌ట్టిన క్యాచ్‌లు, పరుగుల ఆప‌డం వంటి వీడియోలు చూపించాడు. ఈ వీడియోల్లో కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ర‌వీంద్ర జ‌డేజా లు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవ‌రికి అవార్డు వ‌చ్చిందో అన్న విష‌యాన్ని మాత్రం దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ వీడియో ద్వారా తెలియ‌జేశాడు.

ఈ క్ర‌మంలో స‌చిన్ టెండూల్క‌ర్ మాట్లాడుతూ.. 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అనుభ‌వాల‌ను ప్లేయ‌ర్ల‌తో పంచుకున్నాడు. ఆ స‌మ‌యంలో సాధించిన మ‌రుపురాని విజ‌యాల‌ను గుర్తు చేసుకున్నాడు. ఆఖ‌ర్లో బెస్ట్ ఫీల్డ‌ర్ ఎవ‌రో చెప్పాడు. శ్రేయాస్ అయ్యర్‌కు ‘ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ త‌న సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకుంది.

Mohammed Shami: నా సక్సెస్ సీక్రెట్ ఇదే.. అవి చాలా ముఖ్యం మహ్మద్ షమీ

ట్రెండింగ్ వార్తలు