Sachin : భూమండ‌లంపై ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ఆట‌గాడు.. స‌రిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజు చరిత్రను తిరగరాసిన సచిన్

టీమ్ఇండియా అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 24)ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేరు.

Sachin Tendulkar

Sachin Tendulkar : టీమ్ఇండియా అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 24)ను ఎన్న‌టికీ మ‌రిచిపోలేరు. టెస్టుల్లో డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డ‌మే గ‌గ‌నం అయిన రోజుల్లో వ‌న్డేల్లో ద్విశ‌త‌కం అన్న‌ది ఊహించ‌నిది. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌. స‌రిగ్గా 14 సంవ‌త్స‌రాల క్రితం గ్వాలియ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే మ్యాచుల్లో 147 బంతుల్లో 200 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. ఇందులో 25 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ఉన్నాయి.

ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన మొద‌టి ఆట‌గాడిగా స‌చిన్ చ‌రిత్ర సృష్టించాడు. అప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ ఆట‌గాడు అన్వ‌ర్ 194 ప‌రుగులే వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు కాగా.. దీన్ని స‌చిన్ బ‌ద్ద‌లు కొట్టాడు. ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లోని మూడో బంతికి సింగిల్ తీసి స‌చిన్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ భూమండ‌లంపై ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ఆట‌గాడు స‌చిన్ అని ఆ స‌మ‌యంలో కామెంట్రీ చేస్తున్న ర‌విశాస్త్రి అనడం విశేషం.

IND vs ENG 4th test : 51 ప‌రుగులు 3 వికెట్లు.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 ఆలౌట్‌

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. స‌చిన్ ద్విశ‌త‌కం బాద‌డంతో ఈ మ్యాచ్లో భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి 401 ప‌రుగులు చేసింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఏబీ డివిలియ‌ర్స్ (114) సెంచ‌రీతో రాణించినా 42.5 ఓవ‌ర్ల‌లో 248 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్ 153 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

ఇప్ప‌టివ‌ర‌కు 12 డ‌బుల్ సెంచ‌రీలు..

వ‌న్డే క్రికెట్ స‌చిన్ డ‌బుల్ సెంచ‌రీ చేసిన త‌రువాత మ‌రో 11 ద్విశ‌త‌కాలు న‌మోదు అయ్యాయి. ఇందులో ఏడు భార‌త ఆట‌గాళ్లు చేయ‌డం విశేషం. అత్య‌ధికంగా టీమ్ఇండియా ఆట‌గాడు హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ మూడు సార్లు ద్విశ‌త‌కాలు బాదాడు.

వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు వీరే..

స‌చిన్ టెండూల్క‌ర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌, ఇషాన్ కిష‌న్‌, మార్టిన్ గుప్టిల్‌, క్రిస్‌గేల్‌, ఫ‌కార్ జ‌మాన్‌, గ్లెన్ మాక్స్‌వెల్‌, పాతుమ్ నిస్సాంక‌.

ట్రెండింగ్ వార్తలు