IND vs ENG 4th test : 51 ప‌రుగులు 3 వికెట్లు.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 ఆలౌట్‌

సిరీస్‌లో నిల‌బ‌డాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు.

IND vs ENG 4th test : 51 ప‌రుగులు 3 వికెట్లు.. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 ఆలౌట్‌

IND vs ENG 4th test

IND vs ENG 4th test : సిరీస్‌లో నిల‌బ‌డాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. రాంచీ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 353 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో జోరూట్ (122నాటౌట్; 274 బంతుల్లో 10 ఫోర్లు) సెంచ‌రీ చేశాడు. పేస‌ర్ ఓలి రాబిన్స‌న్ (58; 96 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్‌) అర్ధ‌శ‌త‌కం బాదాడు.

మిగిలిన వారిలో బెన్‌ఫోక్స్ (47; 126 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌), జాక్‌క్రాలీ (42; 42 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), జానీ బెయిర్ స్టో(38; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) లు రాణించారు. బెన్‌డ‌కెట్ (11), ఓలీపోప్ (0), బెన్‌స్టోక్స్ (3)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా నాలుగు వికెట్లు తీశాడు. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు తీయ‌గా అశ్విన్ ఓ వికెట్ సాధించాడు.

WPL 2024 : తొలి మ్యాచ్ థ్రిల్లింగ్ విక్టరీ.. లాస్ట్ బాల్‌కు అదిరిపోయే సిక్స్ కొట్టిన సంజనా.. వీడియో వైరల్

51 ప‌ర‌గులు మూడు వికెట్లు..
అంత‌క‌ముందు ఓవ‌ర్ నైట్ స్కోరు 302/7తో రెండో రోజు ఆట‌ను ఆరంభించిన ఇంగ్లాండ్ మ‌రో 51 ప‌రుగులు జోడించి మిగిలిన మూడు వికెట్ల‌ను కోల్పోయింది. శ‌త‌క‌వీరుడు జోరూట్‌(106), రాబిన్స‌న్ (31) లు మొద‌టి రోజు నిల‌క‌డ‌నే కొన‌సాగించారు. ఓవైపు రూట్ బ‌జ్‌బాల్ గేమ్‌ను వదిలి త‌న స‌హ‌జ‌శైలిలో ఆడగా రాబిన్స‌న్ మాత్రం ధాటిగా ఆడాడు. ఈ క్ర‌మంలో టెస్టుల్లో త‌న తొలి హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. ఆ స‌మ‌యంలో వీరిద్ద‌రి జోరు చూస్తుంటే ఇంగ్లాండ్ ఈజీగా నాలుగు వంద‌లు దాటుతుందేమోన‌ని అనిపించింది.

అయితే.. భార‌త బౌల‌ర్ ర‌వీంద్ర జ‌డేజా విజృంభించాడు. ఒకే ఓవ‌ర్‌లో నిల‌దొక్కుకున్న రాబిన్స‌న్‌తో పాటు షోయ‌బ్ బ‌షీర్‌(0)ల‌ను ఔట్ చేశాడు. రాబిన్స‌న్‌-రూట్ జోడి ఎనిమిదో వికెట్ కు 102 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. మ‌రికాసేప‌టికే అండ‌ర్స‌న్‌ను జ‌డేజానే ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేయ‌డంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

Delhi Capitals : ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అత‌డే.. చిన్న‌ట్విస్ట్ కూడా ఉందిగా!