వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా జట్లు ఫేవరేట్లుగా కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటే, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం వరల్డ్ కప్ గెలుచుకునేది భారత్ అనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు. టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడాడు.
mig క్లబ్ ఆరంభోత్సవానికి వచ్చిన టెండూల్కర్ ఇలా తెలిపాడు. ‘ఈ సమ్మర్ చాలా వేడిగా ఉండనుంది. ఆఖరిసారి చాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు మైదానాలు చాలా బాగా కనిపించాయి. పగటి సమయంలో గ్రౌండ్‌లు ఫ్లాట్‌గా కనిపించాయి. బాగా మేఘావృతమై ఉంటేనే మైదానాల్లో తేడా కనిపిస్తుంది. మనం బాగా ఆడితే అది ఏ ఫార్మాట్ అయినా బాగా రాణించగలం. వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు జట్టులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా జట్టులో చేయాల్సిన మెరుగులు గురించి తెలుసుకోవాలి’ అని సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు.
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భారత్ మే 25నుంచి వార్మప్ మ్యాచ్‌లు ఆడనుండగా, అసలైన వాటిలో మొదటి మ్యాచ్‌ను హాంప్‌షైర్ వేదికగా మే5న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.