గుండెలు పిండేసే వీడియో: ఎందరికో ఇన్స్‌పిరేషన్.. వికెట్ల మధ్య పరుగు

  • Publish Date - January 2, 2020 / 01:35 AM IST

క్రికెట్ అంటే పూర్తిగా ఫిట్‌గా ఉంటే ఆడగలిగిన ఆట.. అయితే కాళ్లు లేకపోయినా ఎంతో ఇన్స్‌పిరేషన్ ఇస్తూ రెండు కాళ్లు లేని ఓ చిన్నవాడు ఆడుతున్న క్రికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ దివ్యాంగ బాలుడు కాళ్లు చచ్చుబడిపోయినా మొక్కవోని దీక్షతో తోటి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. బంతిని హిట్ చేసి వికెట్ల మధ్య పరుగులు పెడుతున్నాడు.

ఆ పిల్లాడికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ఫిదా అయిపోయాడు. ఎంతలా అంటే..? నూతన సంవత్సరాన్ని ఈ స్ఫూర్తిమంతమైన వీడియోతో ఆరంభించండి అంటూ సచిన్ స్వయంగా ఆ వీడియోని ట్వీట్ చేసేంతలా.. కాలగమనంలో కలిసిపోయిన దశాబ్దకాలం నుంచి తెలుసుకున్న అనుభవాలను.. ఈ దశాబ్ధంలో ఈ చిన్నారిని స్పూర్తిగా తీసుకుని మార్చుకుంటూ ముందుకు సాగుదాం అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

2020-30 దశాబ్దాన్ని పిల్లలకి అంకితం చేద్దామని పిలుపునిచ్చిన సచిన్ టెండూల్కర్.. వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని సూచించాడు. అలానే తల్లిదండ్రులు తమ పిల్లల తప్పులను సరిచేయడమే కాకుండా వారిని సమాజంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరాడు. అప్పుడే వారికి నేర్చుకోవాలనే తపన పెరుగుతుందని అన్నాడు.