Sachin
Blood Plasma : క్రికెట్ కు గాడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చారు. శనివారం ఆయన 48వ పుట్టిన రోజు జరుపుకున్నారు. చాలా మంది ఆయనకు విషెష్ తెలియచేశారు. అనంతరం ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు సచిన్ వెల్లడించారు.
ఇటీవలే ఆయనకు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. గత నెల 27న సచిన్ కు వైరస్ సోకడంతో..వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందిన అనంతరం ఈ నెల 08వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. తాను కరోనా వైరస్ బారిన పడిన అనంతరం 21 రోజులు హోం ఐసోలేషన్ లో ఉండడం జరిగిందని, అందరి ప్రార్థనల అనంతరం కోలుకున్నట్లు వెల్లడించారు. అయితే..ఈ సందర్భంగా ఓ సందేశం ఇవ్వడానికి ముందుకొచ్చినట్లు, డాక్టర్లు ఇది చెప్పాలని ప్రత్యేకంగా చెప్పారన్నారు.
గత సంవత్సరం తాను ఓ ప్లాస్మా డొనేషన్ క్యాంప్ ప్రారంభించినట్లు, ప్లాస్మా కరెక్టు సమయంలో అందిస్తే..రోగులు త్వరగా కోలుకుంటారని..తాను కూడా ప్లాస్మా ఇవ్వడానికి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని వైద్యులకు చెప్పడం జరిగిందన్నారు. ప్లాస్మా డోనెట్ చేయండి..ప్రాణాలు కాపాడండి..అంటూ..సచిన్ టెండూల్కర్ పిలుపునిచ్చారు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో ఇండియా లెజెండ్స్ కి కెప్టెన్ గా సచిన్ వ్యవహరించారు. ఆ తర్వాత..కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ సిరీస్ లో పాల్గొన్న బద్రీనాథ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇంట్లోనే హోం ఐసోలేషన్ లో ఉంటూ..కరోనా నుంచి కోలుకున్నారు సచిన్. ఆయన త్వరగా..ఆరోగ్యవంతంగా..ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
Read More : Covid-19 : భారత్ లో కరోనా అల్లకల్లోలం, 24 గంటల్లో 2 వేల 767 మంది మృతి
Thank you everyone for your warm wishes. It’s made my day special. I am very grateful indeed.
Take care and stay safe. pic.twitter.com/SwWYPNU73q
— Sachin Tendulkar (@sachin_rt) April 24, 2021