చైనా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా పోరు ముగిసింది. తొలి రౌండ్‌లో పరాజయం పాలైంది. థాయ్ లాండ్ క్రీడాకారిణి బుసానన్ చేతిలో 10-21, 17-21 తేడాతో ఓడిపోయింది. దాదాపు 45 నిమిషాల పాటు ఈ మ్యాచ్ కొనసాగింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది రెండోసారి.
8వ ర్యాంకులో కొనసాగుతున్న సైనా..19వ ర్యాంకు బుసానన్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలి నుంచి బుసానన్ అధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. సైనా పోరాటం ఆమె ముందు నిలువలేకపోయింది. తొలి గేమ్‌లో 10-21తో సైనా కోల్పోయింది. రెండో గేమ్‌లో ఆమెపై పై చేయి సాధించాలని సైనా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా 17-21 తేడాతో సైనా పరాజయం పాలైంది.
మరోవైపు ఈ టోర్నీలో పీవీ సింధు పోరు సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలి రౌండ్‌లో లండన్ ఒలింపిక్స్ ఛాంపియన్ లీ జురుయ్‌తో తలపడనుంది. వీరిద్దరూ ఆరుసార్లు ఢీకొన్నారు. చెరో మూడు మ్యాచ్‌ల్లో నెగ్గారు. మరి సింధు గెలుస్తుందా ? లేదా ? అనేది కొద్దిగంటల్లో తేలనుంది.