మ్యాచ్ ఫిక్సింగేనా : క్రికెటర్ సనత్ జయసూర్యపై నిషేధం

శ్రీలంక లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్యపై ఐసీసీ రెండేళ్ల నిషేదం విధించింది. కొన్నేళ్ల పాటు బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పోయించిన జయసూర్యపై ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు ఏ ఫార్మాట్ క్రికెట్ లోనూ పాల్గొనకూడదంటూ నిషేదం విధించింది. 
Also Read : బెంగళూరులో డూ ఆర్ డై : రెండో టీ20కి రె‘ఢీ’

ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌ను రెండు విధాలుగా ఉల్లంఘించినందుకు ఈ నిషేదాన్ని విధించారు. 

1. ఆర్టికల్ 2.4.6- ఐసీసీ అవనీతి నిరోధక యూనిట్ ఆదేశించిన న్యాయ విచారణకు అటెండ్ కాకపోవడం, లేదా తిరస్కరించడం వల్ల/ అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం, అందించలేకపోవడం.
2. ఆర్టికల్ 2.4.7- ఐసీసీ ఇన్వెస్టిగేషన్‌కు కావాలనే లేట్ చేయడం, ట్యాంపరింగ్, డాక్యుమెంట్లు చించడం, సాక్ష్యాలను పాడు చేయడం వంటివి ఈ ఆర్టికల్ కిందకు వస్తాయి. 

ఈ విషయంపై ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ స్పందిస్తూ… ‘ఐసీసీ నియమాలను ఉల్లంఘించనందుకుగాను జయసూర్యపై ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐసీసీ విధించిన న్యాయ విచారణకు హాజరుకాలేకపోయాడు. ప్రతి ఒక్కరికీ ఈ నిర్ణయం అనేది ఒకేలా ఉంటుంది’ అని వెల్లడించాడు. 

4 నెలల నుంచి జయసూర్యపై స్మగ్లింగ్ కేసులు, దొంగ పేర్లతో కంపెనీలు నడిపిస్తున్నట్లు వదంతులు వచ్చాయి. పన్ను ఎగ్గొట్టేందుకు డమ్మీ కంపెనీలను సృష్టిస్తున్నారని, అతి ఖరీదైన వక్క పలుకులను అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారని విమర్శలు వచ్చాయి. వాటిపై నిర్ధారణ కోసం ఐసీసీ జయసూర్యపై విచారణకు ఆదేశించింది. 
Also Read : సెక్యూరిటీ బర్త్ డే సెలబ్రేట్ చేసిన విరాట్ కోహ్లీ