Sania Mirza
Sania Mirza : భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆగస్టు 30 నుంచి న్యూయార్క్ లో ప్రారంభం కానున్న గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో పాల్గొననుంది. అమెరికా ప్లేయర్ కోకో వాండెవెతో కలిసి సానియా ఆడనుంది.
ఈ మేరకు మహిళల డబుల్స్ విభాగంలో ‘వైల్డ్ కార్డు’ను కేటాయించారు. యూఎస్ ఓపెన్‌కు సన్నాహాల్లో భాగంగా ఈనెల 16 నుంచి జరిగే సిన్సినాటి ఓపెన్ టోర్నీలో ట్యునీషియా క్రీడాకారిణి ఆన్స్ జబూర్‌తో కలిసి సానియా బరిలోకి దిగనుంది.
కాగా తాజాగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో మహిళ డబుల్స్ విభాగంలో అంకిత రైనాతో కలిసి ఆడిన సానియా ఆదిలోనే ఓటమి చవిచూశారు. ఉక్రెయిన్ కవల సోదరీమణులపై సానియా, రైనా జోడి ఓడిపోయింది.