Sanju Samson playing football
Sanju Samson playing football : టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చాడు. ఇప్పుడు అతడు ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. ఏదో సరదాకి ఆడుతున్నాడు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఓ టోర్నీలో ఓ జట్టు తరుపున ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంజు ఫుట్‌బాల్ స్కిల్స్ చూసిన నెటిజన్లు కొందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రొపెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిలో ఉండాల్సిన నైపుణ్యాలు అన్ని అతడిలో ఉన్నాయని అంటున్నారు.
తన సొంత రాష్ట్రమైన కేరళలోని సెవెన్స్ టోర్నీలో ఓ స్థానిక జట్టు తరుపున సంజు శాంసన్ ఆడాడు. సంజు మిడ్‌ఫీల్డ్ నుండి బంతిని అతని పాదాల వద్ద ఉంచుకుని పరిగెత్తడాన్ని వీడియోలో చూడవచ్చు. కాగా.. భారత క్రికెటర్లు ఫుట్‌బాల్ ఆడడం కొత్త కాదు. సన్నాహక సెషన్‌లలో ఫుట్‌బాల్ ఆడటాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చురుకుగా పాల్గొనడం మాత్రం చాలా అరుదు.
సంజు ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారగా క్రికెట్‌కు గుడ్ బై చెబుతావా ఏంటి..? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్‌లో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డేల్లో సంజూకు ఇదే మొదటి శతకం కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో సంజూ 114 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్లు సాయంతో 108 పరుగులుచేశాడు. టెస్టు టీమ్‌లో సంజూకు చోటు దక్కని సంగతి తెలిసిందే.
KL Rahul : ద్రవిడ్‌తో జరిగే ఫన్నీ సంభాషణను వివరించిన కేఎల్ రాహుల్.. దేని గురించో తెలుసా..?
Sanju Samson playing football in a sevens tournament. pic.twitter.com/3c3X7zXMvS
— Johns. (@CricCrazyJohns) December 30, 2023