KL Rahul : ద్ర‌విడ్‌తో జ‌రిగే ఫన్నీ సంభాష‌ణ‌ను వివ‌రించిన కేఎల్ రాహుల్‌.. దేని గురించో తెలుసా..?

భారత వికెట్ కీప‌ర్ కేఎల్‌ రాహుల్‌, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల‌కు మ‌ధ్య కొన్ని విష‌యాలు చాలా కామ‌న్‌గా ఉన్నాయి.

KL Rahul : ద్ర‌విడ్‌తో జ‌రిగే ఫన్నీ సంభాష‌ణ‌ను వివ‌రించిన కేఎల్ రాహుల్‌.. దేని గురించో తెలుసా..?

KL Rahul wicket keeping conversations with Rahul Dravid

Updated On : December 30, 2023 / 7:54 PM IST

KL Rahul – Rahul Dravid : భారత వికెట్ కీప‌ర్ కేఎల్‌ రాహుల్‌, భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ల‌కు మ‌ధ్య కొన్ని విష‌యాలు చాలా కామ‌న్‌గా ఉన్నాయి. వారిద్ద‌రి పేర్లు దాదాపుగా ఒక‌టే కాగా.. ఇద్ద‌రూ కూడా క‌ర్ణాట‌క రాష్ట్రానికి చెందిన వారే కావ‌డం విశేషం. ఇక ఇద్ద‌రూ భార‌త జ‌ట్టులోకి బ్యాట‌ర్లుగా ఎంట్రీ ఇచ్చినా ఆ త‌రువాతి కాలంలో జ‌ట్టు అవ‌స‌రాల దృష్ట్యా వికెట్ కీప‌ర్ అవ‌తారం ఎత్తిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం స్టార్ స్పోర్స్ ఓ వీడియోని విడుద‌ల చేసింది. ఇందులో కేఎల్ రాహుల్‌ను హోస్ట్ మాయంతి లాంగర్ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ క్ర‌మంలో వికెట్ కీపింగ్ గురించి ద్ర‌విడ్‌తో జ‌రిగిన సంభాష‌ణ‌ను కేఎల్ రాహుల్ వివ‌రించాడు.

2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌గా రాహుల్ ద్ర‌విడ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ఇక 2023లో స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీప‌ర్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ రెండు సంద‌ర్భాల్లో టీమ్ఇండియా పైన‌ల్‌కు చేరుకుంది. అయితే.. ఫైన‌ల్ మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ రెండు సార్లు కూడా ప్ర‌త్య‌ర్థి ఆస్ట్రేలియానే కావ‌డం గ‌మ‌నార్హం.

Team India : రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ‌..?

స‌ర‌దా సంభాష‌ణ‌లు..

వికెట్ కీపింగ్ అనేది క‌ష్ట‌మైన ప‌ని. రోజంగా మైదానంలో ఉండాల్సి ఉంటుంది. కీపింగ్‌ చేసిన త‌రువాత‌ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. వికెట్ కీప‌ర్ ఓపెనింగ్ బ్యాట‌ర్ అయితే అత‌డు ఇంకా ఎక్కువ బాధ‌ను అనుభ‌విస్తాడు. 50 ఓవ‌ర్ల పాటు మైదానంలో కీపింగ్ చేసిన త‌రువాత కొన్ని నిమిషాల విరామంలోనే బ్యాటింగ్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది అని వికెట్ కీప‌ర్ అనుభ‌వించే భాద‌ల‌ను రాహుల్ చెప్పుకొచ్చాడు.

వికెట్ కీపింగ్ గురించి రాహుల్ ద్ర‌విడ్‌తో ఎలాంటి చ‌ర్చ‌లు చేశార‌ని అడిగిన‌ప్పుడు కేఎల్ రాహుల్ ఇలా చెప్పుకొచ్చాడు. మా ఇద్ద‌రి మ‌ధ్య వికెట్ కీపింగ్ గురించి జ‌రిగే సంభాష‌ణ‌లు చాలా స‌ర‌దాగా ఉంటాయ‌ని చెప్పాడు. మేము మాట్లాడే ఏకైక విష‌యం ఏంటంటే..? 50 ఓవ‌ర్ల పాటు కీపింగ్ చేసిన‌ప్పుడు వెన్ను నొప్పి ఎలా ఉంటుంది. ఎంత అల‌సిపోతారు అని. ఎందుకంటే ఆ త‌రువాత వెళ్లి బ్యాటింగ్ చేయాలి కాబ‌ట్టి మా మ‌ధ్య ఎక్కువ‌గా శ‌క్తిని ఎలా కోల్పోకుండా జాగ్ర‌త్త‌గా శ‌రీరాన్ని కాపాడుకోవాలి అనేది దాని గురించే ఉంటుంది అని రాహుల్ తెలిపాడు.

Rohit Sharma : మాకు ఎలా బ్యాటింగ్ చేయాలో తెలుసు.. మీరు కాస్త వాటిని చూసి మాట్లాడండి..!