IND vs BAN : భారత్ దెబ్బకు బంగ్లాదేశ్ చిత్తు.. టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్..!

IND vs BAN : సంజూ శాంసన్ అద్భుతమైన సెంచరీ, భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ చేతులేత్తేసింది. ఆఖరి మ్యాచ్ గెలుపుతో సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

Sanju Samson Ton Powers India ( Image Source : Google/Twitter

IND vs BAN : హైదరాబాద్‌లో ఉప్పల్ వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి జట్టు బంగ్లాదేశ్‌పై సంజూ శాంసన్ అత్యద్భుతమైన తొలి సెంచరీతో భారత్ 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా భారత్ 3-0తో బంగ్లాదేశ్‌‌పై గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంతో విజయం అనివార్యమైంది.

ముందుగా బ్యాటింగ్‌కు ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసి బంగ్లాదేశ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, లక్ష్య ఛేదనలో బంగ్లా ఆటగాళ్లు తేలిపోయారు. బంగ్లా ఆటగాళ్లలో హిర్దోయ్ (63), లిటన్ దాస్ (42) టాప్ స్కోరర్లుగా నిలవగా, మిగతా ఆటగాళ్లు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులకే చేతులేత్తేశారు. భారత పేసర్ మయాంక్ యాదవ్ (2/32), లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (3/30) బంగ్లా పతనాన్ని శాసించారు. వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు.

సెంచరీతో విజృంభించిన సంజూ శాంసన్ :
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఓపెనర్ అభిషేక్‌ శర్మ (4) పరుగులకే చేతులేత్తేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (75, 35 బంతుల్లో, 8×4, 5×6), సంజూ శాంసన్ (111, 47 బంతుల్లో, 11×4, 8×6) 173 పరుగులు పారిస్తూ బంగాళ్ల బౌలర్లకు చెమటలు పట్టించారు. రిషద్‌ పంత్ పదో ఓవర్‌లో శాంసన్ ఏకంగా 30 పరుగులు చేశాడు.

తొలి బంతి మిస్ అయినా మిగతా బంతులను సిక్సర్లు బాదాడు. ఫలితంగా శాంసన్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. చివరిలో రియాన్‌ పరాగ్‌ (34), హార్దిక్‌ పాండ్య (47) పరుగులతో రాణించగా, నీతీశ్‌ రెడ్డి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. రింకూ సింగ్‌ (8) నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్‌ 3 వికెట్లు, తస్కిన్‌, ముస్తఫిజుర్‌, మహ్మదుల్లా తలో వికెట్‌ పడగొట్టారు.

Read Also : MS Dhoni Hairstyle : మిస్టర్ కూల్ న్యూలుక్ అదుర్స్.. ధోనీ కొత్త హెయిర్‌స్టైల్‌‌ చూశారా? ఫొటో వైరల్!