Malaysia Open 2024 : మ‌లేషియా ఓపెన్‌లో సాత్విక్‌-చిరాగ్ కి త‌ప్ప‌ని నిరాశ‌.. ర‌న్న‌ర‌ప్ తో స‌రి..

భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి కి నిరాశే ఎదురైంది.

Satwiksairaj Rankireddy-Chirag Shetty

Malaysia Open 2024 : భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి కి నిరాశే ఎదురైంది. కౌలాలంపూర్ వేదిక‌గా జ‌రుగుతున్న మ‌లేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు చేరుకున్న ఈ జోడి ఆఖ‌రి మెట్టు పై బోల్తా ప‌డింది. ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచులో చైనాకు చెందిన ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ జోడి వాంగ్‌-లియాంగ్ పై 9-21, 21-18, 21-17 తేడాతో భార‌త జోడి ఓడిపోయింది. దీంతో భార‌త ద్వ‌యం ర‌న్న‌ర‌ప్‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఫైన‌ల్ మ్యాచ్ 58 నిమిషాల పాటు సాగింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి జోడి మొద‌టి సెట్‌ను గెలిచి అంచ‌నాల‌ను పెంచేశారు. అయితే.. రెండో సెట్ నుంచి చైనా జోడి పుంజుకుంది. అదే సమ‌యంలో స‌ర్వీస్ ఎర్ర‌ర్ కార‌ణంగా రెండో సెట్ ఆరంభం నుంచే భార‌త జోడి మ్యాచ్ పై నియంత్ర‌ణ కోల్పోయారు. క్ర‌మంగా ప‌ట్టుబిగించిన చైనా జోడీ రెండో సెట్‌తో పాటు మూడో సెట్‌లో గెలుపెంది విజేత‌గా నిలిచింది.

Mohammad Rizwan : టీ20ల్లో రిజ్వాన్ అరుదైన రికార్డు.. సిక్స‌ర్ల మోత‌..