Scotland announced 15 member squad for the 2026 T20 World Cup
T20 World Cup 2026 : అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేదు. బంగ్లాదేశ్ రూపంలో స్కాట్లాండ్‌కు అరుదైన అవకాశం దక్కింది. టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే ఛాన్స్ లభించింది. అలా అవకాశం వచ్చిందో లేదో.. తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధం అంటోంది స్కాట్లాండ్. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెగాటోర్నీలో పాల్గొనే తమ జట్టును ఆదేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఇక ఈ బృందానికి రిచీ బెరింగ్టన్ నాయకత్వం వహించనున్నట్లు తెలిపింది. 2024లో టీ20 ప్రపంచకప్‌లో పాల్గొన్న వారిలో 11 మంది ఆటగాళ్లు తాజా టోర్నీకి ఎంపిక కావడం విశేషం. అంతేకాదండోయ్ ఇద్దరు ట్రావెలింగ్ రిజర్వ్‌లు, మరో ముగ్గురిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు. స్కాట్లాండ్ జట్టుకు ఓవెన్ డాకిన్స్ హెడ్ కోచ్‌గా ఉన్నారు.
‘మేం టోర్నమెంట్‌లో పాల్గొననున్నాము అని తెలిసినప్పటికి నుంచి ఎంతో ఆసక్తిగా ఉన్నాము. మిగిలిన జట్లతో పోలిస్తే మాకు తక్కువ సమయం ఉంది. అయినప్పటికి కూడా మెగా టోర్నీకి మేము బాగా సన్నద్ధం అవుతాము. సత్తా చూపగల ప్లేయర్లు మా వద్ద ఉన్నారు. భారత్‌లో ఆడాలని ఉత్సాహంగా ఉన్నాము.’ అని డాక్సిన్ తెలిపారు.
Introducing your Scotland squad heading to the ICC Men’s #T20WorldCup in India and Sri Lanka 🤩
➡️ https://t.co/cmtJB52phQ pic.twitter.com/2EQgZb5CdH
— Cricket Scotland (@CricketScotland) January 26, 2026
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో స్కాట్లాండ్ గ్రూప్-సిలో ఉంది. ఈ టోర్నీలో స్కాట్లాండ్ తమ తొలి మ్యాచ్‌ను కోల్‌కతా వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆ తరువాత అదే వేదికలో ఫిబ్రవరి 9న వెస్టిండీస్, 14న ఇటలీలతో ఆడనుంది. ఆ తరువాత ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‌తో తలపడనుంది.
IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్.. అయ్యర్‌కు మాత్రం..
ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్ ఇప్పటి వరకు ఆరు సార్లు అంటే.. 2007, 2009, 2009, 2016, 2021, 2022, 2024 ప్రపంచకప్‌లలో ఆడింది. తమ కంటే ఎంతో మెరుగైన జట్లకు షాకిచ్చిన ఘనత సైతం కలిగి ఉంది. 2021 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ను, 2022 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టుకు షాకిచ్చింది. ఇక ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2026లో పలు జట్లకు షాకిచ్చేందుకు సిద్ధం అవుతుంది.
టీ20 ప్రపంచ కప్ కోసం స్కాట్లాండ్ జట్టు ఇదే..
రిచీ బెరింగ్టన్, టామ్ బ్రూస్, మాథ్యూ క్రాస్, బ్రాడ్లీ క్యూరీ, ఆలివర్ డేవిడ్సన్, క్రిస్ గ్రీవ్స్, జైనుల్లా ఇహ్సాన్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, ఫిన్లే మెక్‌క్రీత్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, మార్క్ వాట్, బ్రాడ్లీ వీల్
ట్రావెలింగ్ రిజర్వ్‌లు.. జాస్పర్ డేవిడ్సన్, జాక్ జార్విస్.
నాన్-ట్రావెలింగ్ రిజర్వ్‌లు.. మెకెంజీ జోన్స్, క్రిస్ మెక్‌బ్రైడ్, చార్లీ టియర్.