WPL 2026 : ఆ కొట్టుడు ఏందీ అమ్మా.. దెబ్బకు 1059 రోజుల నిరీక్షణకు తెర.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన నాట్ స్కైవర్ బ్రంట్..
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్ బ్రంట్ అరుదైన ఘనత సాధించింది.
WPL 2026 Nat Sciver Brunt became the first cricketer to score a century in Womens Premier League
WPL 2026 : ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ నాట్ స్కైవర్ బ్రంట్ అరుదైన ఘనత సాధించింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. 2023లో డబ్ల్యూపీఎల్ ప్రారంభం కాగా మూడు సీజన్ల పాటు పలువురు ప్లేయర్లు 90ల్లోకి వచ్చినప్పటికి కూడా సెంచరీ పూర్తి చేసుకోలేకపోయారు. ఎట్టకేలకు నాలుగో సీజన్‌లో ఆ లోటును నాట్ స్కైవర్ బ్రంట్ తీర్చేసింది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో నాట్ స్కైవర్ బ్రంట్ ఈ ఘనతను సాధించింది.
నాట్ స్కైవర్ బ్రంట్ (100 నాటౌట్; 57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. నాట్ కాకుండా మిగిలిన ముంబై బ్యాటర్లలో హేలీ మాథ్యూస్ (56; 39 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించింది. ఆర్‌సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీసింది. నాడిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్ లు తలా ఓ వికెట్ సాధించారు.
IND vs NZ : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్.. అయ్యర్‌కు మాత్రం..
Special memory unlocked! 🌟
Natalie Sciver-Brunt becomes the first-ever #TATAWPL centurion 💯
Updates ▶️ https://t.co/yUHXkzVIZw #KhelEmotionKa | #RCBvMI | @mipaltan pic.twitter.com/ytmHKwycPA
— Women’s Premier League (WPL) (@wplt20) January 26, 2026
అనంతరం రిచా ఘోష్ (90; 50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపులు మెరిపించినప్పటికి మిగిలిన వారు విఫలం కావడంతో 200 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్‌సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆర్‌సీబీ బ్యాటర్లలో స్మతి మంధాన (6), రాధా యాదవ్ (0), గౌతమీ నాయక్ (1), గ్రేస్ హారిస్ (15)లు ఘోరంగా విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టింది. షబ్నిమ్ ఇస్మాయిల్, అమేలియా కెర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. అమన్‌జోత్ కౌర్ ఓ వికెట్ సాధించింది.
Prathyoosha Kumar : బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న ఆర్‌సీబీ ప్లేయర్ ప్రత్యూష
సెంచరీ చేయడం పట్ల నాట్ స్కైవర్ బ్రంట్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన కెరీర్‌లో ఇది ఓ ప్రత్యేక క్షణంగా నిలిచిపోతుందని చెప్పింది. ’90లలో కొద్ది మంది ప్లేయర్లు ఔట్ అవ్వడాన్ని చూశాను. నేను దానిని పునరావృతం చేయాలనుకోలేదు. జట్టు కోసం సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలని అనుకున్నాను. మైలురాయిని చేరుకోవడంతో పాటు జట్టు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.’ నాట్ స్కైవర్ బ్రంట్ తెలిపింది. తన కెరీర్‌లో ఇదే తొలి టీ20 సెంచరీ అని చెప్పింది. అయితే.. ఇదే చివరిది కాకూడదని, మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తోంది.
