New Project
New T20I Captain: టీమిండియా కోసం నేషనల్ సెలక్షన్ కమిటీ కసరత్తులు మొదలుపెట్టింది. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించేయడంతో టీ20 ఫార్మాట్ కోసం వెదికే పనిలో పడ్డారు. హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఇతర పదవులు ఖాళీ అవగా.. వాటి కోసం ఆల్రెడీ దరఖాస్తులు అందాయి. టీ20 కెప్టెన్ గా మాత్రం ఎవరా అనే దానిపై తర్జనభర్జనలు పడుతుంది సెలక్షన్ కమిటీ.
మూడ్రోజుల్లో సెలెక్షన్ కమిటీ భేటీ అయి వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జరిగే న్యూజిలాండ్ తో మ్యాచ్ ల నాటికి ఎంపిక పూర్తవ్వాలని ప్రిపేర్ అవుతుంది. ఇండియాలోనే జరగనున్న ఈ మ్యాచ్ లకు కివీస్ ఇక్కడకు వస్తుంది. మూడు ఫార్మాట్లకు నాయకుడిగా ఉన్న కోహ్లీ.. స్థానంలో టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపికపై పరిశీలనలు జరుగుతున్నాయి.
కెప్టెన్సీ రేసులో రోహిత్ శర్మ ముందుండగా.. కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌కు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఏప్రిల్ నుంచి ఐపీఎల్ తో పాటు గ్యాప్ లేకుండా ఆడుతుండటంతో రెస్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది. మరి తాత్కాలికంగా కివీస్‌తో టీ20 సిరీస్‌కు, అలానే టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా ఎవరనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది.
………………………………………… : భూమిపై అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ
కోహ్లీ టీ20 కెప్టెన్సీని మాత్రమే వదిలేస్తుండటంతో మిగతా ఫార్మాట్లపై చర్చించే అవకాశం ఉండకపోవచ్చు. సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ, సభ్యుడు అబే కురువిల్లా దుబాయ్‌లోనే ఉండగా.. మిగిలిన సభ్యులు భారత్‌లో ఉన్నారు.
నవంబర్ 10లోపు టీమిండియా హెడ్ కోచ్ పదవిని బీసీసీఐ భర్తీ చేయనుంది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు గత అక్టోబర్ 26వరకు మాత్రమే బీసీసీఐ గడువునిచ్చింది.
మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, ఇతర సిబ్బంది నియామకం కోసం దరఖాస్తుల సమర్పణకు నవంబర్ 3 వరకు గడువు ఉంది. నవంబర్ 10లోపు బీసీసీఐ ఇంటర్వ్యూలు పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎటువంటి స్పష్టత రాలేదు. బీసీసీఐ నిర్ణయాలను క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఆమోదించాల్సి ఉంది.
భారత్‌లో న్యూజిలాండ్ పర్యటన నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 17న జైపూర్ వేదికగా తొలి టీ20, 19న రాంచీలో రెండో టీ20, 21 కోల్‌కతాలో మూడో టీ20 మ్యాచ్ జరగనున్నాయి. నవబర్ 25నుంచి 29 వరకు మొదటి టెస్టు(కాన్పూర్), డిసెంబర్ 3 నుంచి 7వరకు రెండో టెస్టు మ్యాచ్ ముంబైలో తలపడతాయి.