Lionel Messi World Cup shirts
Lionel Messi World Cup shirts : ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెస్సీ పేరు చెబితే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. గతేడాది ఈ దిగ్గజ ఆటగాడు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022లో ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో ఫ్రాన్స్ ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచులో మెస్సీ రెండు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ ప్రపంచకప్ సమయంలో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను తాజాగా వేలం వేశారు. వీటిని రూ.64 కోట్లకు ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే.. ఎవ్వరూ వీటిని వేలంలో గెలుచుకున్నారు అన్న సంగతిని వేలం నిర్వాహకులు బయటకు వెల్లడించలేదు. ఈ మొత్తంలో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు మాత్రం తెలిపారు.
Virat kohli : టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికాకు బయలుదేరిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
అర్జెంటీనాకు చెందిన సోథెబీస్ అనే కంపెనీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో పాటు ఆ టోర్నీలో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను సేకరించింది. వీటిని గురువారం న్యూయార్క్‌లో వేలం వేసింది. 7.8 మిలియన్ల డాలర్లకు ఇవి అమ్ముడు పోయాయి.ఈ క్రమంలో ప్రపంచ క్రీడల చరిత్రలో మూడోో అత్యధిక ధర పలికిన జెర్సీగా నిలిచింది.
లియో మెస్సీ ఫౌండేషన్ మద్దతుతో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు సాయం చేసేందుకు శాంట్ జోన్ డి డ్యూ బార్సిలోనా చిల్డ్రన్స్ హాస్పిటల్ నేతృత్వంలోని UNICAS ప్రాజెక్ట్‌కి వేలం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా అందజేస్తామని సోథెబీస్ చెప్పింది.
Suryakumar Yadav : గాయంతో మైదానాన్ని వీడిన సూర్య.. మ్యాచ్ తరువాత అసలు విషయం చెప్పేశాడు..
ప్రపంచకప్ కలను నెరవేర్చుకున్న అనంతరం మెస్సీ పీఎస్‌జీ క్లబ్‌ను వీడాడు. అమెరికాకు చెందిన ఇంటర్ మియామి క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. మేజర్ సారగ్ లీగ్‌లో ఆ జట్టును విజేతగా నిలిపాడు. ఈ సంవత్సరం మెస్సీ అద్భుతంగా రాణించాడు. దీంతో అతడికి ప్రతిష్ఠాత్మక ‘బాలన్ డీ ఓర్’ అవార్డు దక్కింది. ఈ అవార్డును అతడు రికార్డు స్థాయిలో ఎనిమిదో సారి అందుకోవడం గమనార్హం.