Shaheen Afridi : ఆ కార‌ణం చేత‌నే బ్యాగులు మోశాం.. లేదంటేనా..? : పాకిస్తాన్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది

Shaheen Afridi comments : ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచుల సిరీస్ ఆడేందుకు ఇటీవ‌ల పాకిస్తాన్ జ‌ట్టు ఆసీస్‌కు చేరుకుంది.

Shaheen Afridi

ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచుల సిరీస్ ఆడేందుకు ఇటీవ‌ల పాకిస్తాన్ జ‌ట్టు ఆసీస్‌కు చేరుకుంది. అయితే.. సిడ్నీ ఎయిర్‌పోర్టులో పాకిస్తాన్ ఆట‌గాళ్లు త‌మ ల‌గేజీల‌ను కంటైన‌ర్ ట్ర‌క్కులో ఎక్కించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. అభిమానులు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(సీఏ) పై విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై పాకిస్తాన్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది స్పందించాడు. తాము ల‌గేజ్‌ల‌ను ట్ర‌క్కుల‌ను ఎందుకు ఎక్కించాల్సి వ‌చ్చిందో అన్న కార‌ణాల‌ను వెల్ల‌డించారు.

కాన్‌బెర్రాలో పాక్ ఆట‌గాళ్ల ప్రాక్టీస్ సెష‌న్ ముందు అఫ్రిది ఈ విష‌యం పై మాట్లాడాడు. తాము మ‌రో విమానం ఎక్కేందుకు కేవ‌లం 30 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ఆట‌గాళ్లు ఒక‌రికొక‌రం సాయం చేసుకున్న‌ట్లు వెల్ల‌డించారు.

Mitchell Johnson : ఆస్ట్రేలియా ప‌రువు తీసిన డేవిడ్ వార్న‌ర్‌.. ఘ‌న వీడ్కోలుకు అర్హుడు కాదు.. మాజీ పేస‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘ఇంకో విమానం ఎక్కేందుకు మాకు 30 నిమిషాల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అక్క‌డ ఇద్ద‌రు సిబ్బంది మాత్ర‌మే ఉన్నారు. మేము వారికి సాయం చేశాం. త్వ‌ర‌గా ల‌గేజీ ఎక్కించి స‌మ‌యాన్ని ఆదా చేయాల‌ని అనుకున్నాం. మేమందరం ఓ కుటుంబంగా భావిస్తాం. అందుక‌నే ఒక‌రికొక‌రం సాయం చేసుకున్నాం. ‘అని అఫ్రిది చెప్పాడు.

పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య డిసెంబ‌ర్ 14 నుంచి 18 వ‌ర‌కు మొద‌టి టెస్టు, డిసెంబ‌ర్ 26 నుంచి 30 వ‌ర‌కు రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. కాగా.. పాకిస్తాన్ జ‌ట్టు ఆస్ట్రేలియాలో ఇంత వ‌ర‌కు టెస్టు సిరీస్ గెల‌వ‌లేదు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో ఘోర ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో కెప్టెన్సీ ప‌ద‌వికి బాబ‌ర్ ఆజాం రాజీనామా చేశాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టెస్టుల‌కు షాన్ మ‌సూద్‌కు కెప్టెన్‌గా నియ‌మించింది. కొత్త కెప్టెన్ షాన్ మ‌సూద్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ ఎలా ఆడ‌నుంది అనే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Bangladesh Players : అదృష్టం అంటే బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌దే.. ఒక్క మ్యాచులో గెల‌వ‌గానే.. బోన‌స్‌, డిన్న‌ర్ ఇంకా..

ట్రెండింగ్ వార్తలు