Shaheen Afridi Urges Pakistan To Maintain Winning Momentum Ahead of Srilanka ODI series
Shaheen Afridi : శ్రీలంక జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో ఆతిథ్య పాక్‌తో లంక జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డే మ్యాచ్ నేడు (మంగళవారం నవంబర్ 11)న రావల్పిండి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ ముందు పాక్ కొత్త వన్డే కెప్టెన్ షాహీన్ అఫ్రిది తన సహచర ఆటగాళ్లకు ఓ సందేశం ఇచ్చాడు. గెలుపు జోష్‌ను కంటిన్యూ చేయాలని తన టీమ్ సభ్యులను కోరాడు.
షాహీన్ అఫ్రిది నాయకత్వంలో స్వదేశంలో పాక్ జట్టు ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. షాహీన్ వన్డే కెప్టెన్‌గా నియమితులైన తరువాత ఆడిన తొలి సిరీస్‌లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో అదే జోష్‌ను శ్రీలంక పై కొనసాగించాలని, విజయం సాధించాలని సహచరులను కోరారు.
Azam Khan : మ్యాచ్ మధ్యలో ఘోర అవమానం.. ఏడ్చేసిన పాక్ క్రికెటర్ ఆజం ఖాన్.. నాకు ఇజ్జత్ ఉందా?
‘దక్షిణాఫ్రికాపై సిరీస్ విజయం మా ఆత్మవిశ్వాసానికి పెంపొందించింది. వన్డే కెప్టెన్‌గా ఇది నా తొలి సిరీస్. ఆటగాళ్లు విభిన్న పరిస్థితుల్లో అద్భుతంగా స్పందించి ఓ యూనిట్‌గా ఆడారు. ఇది నాకు నిజంగా గర్వంగా ఉంది.’ అని అఫ్రిది అన్నాడు.
‘లంకతో సిరీస్‌లోనూ గెలుపు యాత్రను కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. ప్రస్తుతం జట్టుగా స్థిరంగా విజయాలు సాధించడంపైనే మా దృష్టి ఉంది. ఇక ప్రతి విభాగంలోనూ జట్టుగా మేము మెరుగుపడుతూనే ఉన్నామని నిర్ధారించుకోవాలనుకుంటున్నాము.’ అని అఫ్రిది తెలిపాడు.
Sanju Samson : ట్రేడింగ్ రూమర్ల మధ్య.. సంజూ శాంసన్ పై చెన్నై సూపర్ కింగ్స్ పోస్ట్..
శ్రీలంక జట్టు అద్భుమైన జట్టు అని, ఆ జట్టును తక్కువ అంచనా వేస్తే ముప్పు తప్పదన్నాడు. తమ ప్రణాళికలను మైదానంలో సక్రమంగా అమలు చేయాలని సూచించాడు. ఆఖరికి అభిమానులను అలరించడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చాడు. ఇక జట్టులోని ప్రతీ ఆటగాడు బాధ్యతను తీసుకోవాలని సూచించాడు. తనతో పాటు సీనియర్ ఆటగాళ్లు , ఫఖర్ (జమాన్), బాబర్ (ఆజామ్) లేదా సైమ్ ఇలా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నాడు. అదే సమయంలో ఎవరైన ఆటగాడు విపలం అయినా కూడా జట్టుగా మద్ధతు ఇస్తామన్నాడు.
లంకతో వన్డే సిరీస్‌కు పాక్ జట్టు ఇదే..
షాహీన్ అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా.