ఒక్క సిరీస్‌కే అల్లుడి కెప్టెన్సీ పోయింది.. మామ‌ రియాక్ష‌న్ వైర‌ల్‌

పీసీబీ ఆదివారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైట్‌బాల్ కెప్టెన్‌గా మ‌ళ్లీ బాబ‌ర్ ఆజామ్‌ను నియ‌మించింది.

Shaheen Afridi - Shahid Afridi

Shahid Afridi – Shaheen Afridi : భార‌త్ వేదిక‌గా గ‌తేడాది జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి బాబ‌ర్ ఆజామ్ త‌ప్పుకున్నాడు. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాన్ మసూద్‌కు టెస్ట్, పేసర్ షాహీన్ అఫ్రిదికి టీ20 నాయ‌కత్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. పీసీబీ ఆదివారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వైట్‌బాల్ కెప్టెన్‌గా మ‌ళ్లీ బాబ‌ర్ ఆజామ్‌ను నియ‌మించింది. వ‌న్డేలు, టీ20ల్లో పాకిస్తాన్ జ‌ట్టును బాబ‌ర్ న‌డిపించ‌నున్నాడు.

షాహీన్ నాయ‌క‌త్వంలో జ‌న‌వ‌రిలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ వ‌రుస ఓట‌ముల‌ను చ‌విచూసింది. 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. దీంతో షాహీన్ అఫ్రిది కెప్టెన్సీ ఒక్క సిరీస్‌కే పరిమితం చేసింది పీసీబీ. కాగా.. కెప్టెన్సీ మార్పు పై పాకిస్తాన్ జ‌ట్టు మాజీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. పీసీబీ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు కెప్టెన్సీ ప‌గ్గాలు అందిస్తే బాగుండేద‌ని అభిప్రాయ ప‌డ్డాడు.

MS Dhoni : మ‌నం మ్యాచ్ ఓడిపోయాం.. ఎవ‌ర‌న్నా గుర్తు చేయండ‌బ్బా..! సాక్షి పోస్ట్ వైర‌ల్‌

‘సెలక్షన్ కమిటీలో చాలా అనుభవజ్ఞులైన క్రికెటర్లు ఉన్నారు. వీరంద‌రూ క‌లిసి తీసుకున్న నిర్ణ‌యం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. కెప్టెన్‌ను మార్చాల‌ని మీరు భావించినట్ల‌యితే మ‌హ్మ‌ద్ రిజ్వాన్ ఒక ఉత్త‌మ ఎంపిక. అయితే.. ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నారు. కాబ‌ట్టి నేను పాకిస్తాన్ జ‌ట్టుకు మ‌ద్ద‌తుగా ఉంటాను. అదే విధంగా మ‌ళ్లీ కెప్టెన్‌గా నియ‌మితులైన బాబ‌ర్ ఆజామ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను.’ అని అంటూ షాహిద్ అఫ్రిది త‌న సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చాడు.

షాహిద్ అఫ్రిది త‌న కూతురిని పేస‌ర్ షాహిద్ అఫ్రిదికి ఇచ్చి వివాహం జ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. షాహిన్‌కు కెప్టెన్సీ ఇవ్వ‌డాన్ని మొద‌టి నుంచి కూడా షాహిద్ వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నాడు. టీ20 కెప్టెన్‌గా షాహిన్ అఫ్రిది పేరు ప్ర‌క‌టించిన స‌మ‌యంలోనూ బహిరంగంగానే షాహిద్ అఫ్రిది త‌న నిర్ణ‌యాన్ని చెప్పాడు. అత‌డికి కెప్టెన్సీ వ‌ద్ద‌ని మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌కు నాయ‌కత్వ బాధ్య‌త‌లు అందించాల‌ని టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో అత‌డు అన్నాడు.

Rishabh Pant : వారెవ్వా పంత్.. ఇలాంటి సిక్స్ చూసి ఎన్నాళ్ల‌య్యిందో.. వీడియో వైర‌ల్‌

కాగా.. ఒక్క సిరీస్ ఓడినంత మాత్రాన కెప్టెన్సీ నుంచి తొల‌గిస్తారా అని షాహిన్ అఫ్రిది అభిమానులు మండిప‌డుతున్నారు. అయితే.. అందుకున్న స‌మాచారం ప్ర‌కారం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్‌ను సమర్థవంతంగా నడిపించడంలో షాహీన్ విఫ‌లం అయ్యాడు. దీంతో లాహోర్ ఖ‌లంద‌ర్స్ ఈ సీజ‌న్‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విఫ‌లం కావ‌డం, వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు