DPL Match : వికెట్లను తన్ని, పీకి పారేసి..తర్వాత క్షమాపణ చెప్పిన షకీబ్

క్రికెట్ లోకాన్ని సిగ్గుపడేలా చేసిన బంగ్లాదేశ్‌ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్.. తన అనుచిత ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాడి అయిన తాను అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని, ఎంతో బాధగా ఉందన్న షకీబ్‌.. రెండు జట్లకు, మేనేజ్‌మెంట్లకు, మ్యాచ్ అధికారులకు సారీ చెప్పాడు.

Shakib Al Hasan Apology : క్రికెట్ లోకాన్ని సిగ్గుపడేలా చేసిన బంగ్లాదేశ్‌ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్.. తన అనుచిత ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ఆటగాడి అయిన తాను అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందని, ఎంతో బాధగా ఉందన్న షకీబ్‌.. రెండు జట్లకు, మేనేజ్‌మెంట్లకు, మ్యాచ్ అధికారులకు సారీ చెప్పాడు. మరోసారి ఇలాంటి దుందుడుకు చర్యలు పునరావృతం కానివ్వనని స్పష్టం చేశారు. అబహాని లిమిటెడ్ జట్టుతో మ్యాచ్ జరుగుతోంది.

అంపైర్ అవుట్ ఇవ్వలేదని షకీబ్ మైదానంలో విచిత్రంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే,. క్రికెట్ సమాజం తలదించుకునే విధంగా మైదానంలో బిహెవ్‌ చేశారు. తన బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ అవుటైనా.. అంపైర్ అవుటివ్వకపోవడంతో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోని వికెట్లను షకీబ్ బలంగా కాలితో తన్నాడు. అంతటితో ఆగకుండా అంపైర్‌ను దుర్భాషలాడుతూ అతనిపైకి దూసుకెళ్లాడు. బంగ్లాదేశ్‌‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ టీ20 క్రికెట్ లీగ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు క్రికెట్ లోకాన్నే దిగ్భాంతికి గురి చేస్తోంది. మహమ్మదెన్ స్పోర్టింగ్ క్లబ్‌ జట్టుకు షకీబ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Read More : Yadadri Temple : యాదాద్రికి వెళ్లనున్న సీజేఐ జస్టిస్ రమణ, సీఎం కేసీఆర్

ట్రెండింగ్ వార్తలు