Yadadri Temple : యాదాద్రికి వెళ్లనున్న సీజేఐ జస్టిస్ రమణ, సీఎం కేసీఆర్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రిలో పర్యటించనున్నారు. సీజేఐతో పాటు యాదాద్రికి గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ లు వెళ్లనున్నారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం వీరి పర్యటన జరుగనుంది. ప్రస్తుతం యాదాద్రి పునర్ నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Yadadri Temple : యాదాద్రికి వెళ్లనున్న సీజేఐ జస్టిస్ రమణ, సీఎం కేసీఆర్

Supreme Court Chief Justice Nv Ramana And Cm Kcr To Visit Yadadri

CJI Ramana And KCR : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ యాదాద్రిలో పర్యటించనున్నారు. సీజేఐతో పాటు యాదాద్రికి గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ లు వెళ్లనున్నారు. 2021, జూన్ 14వ తేదీ సోమవారం వీరి పర్యటన జరుగనుంది. ప్రస్తుతం యాదాద్రి పునర్ నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలో మొదటిసారి యాదాద్రిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు. సీజేఐ హోదాలో వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది.

పునర్ నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. నూతనంగా నిర్మిస్తున్న ఆలయం విశిష్టతలను, క్షేత్ర మహిమను.. చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు వివరించనున్నారు సీఎం కేసీఆర్‌. మూడు రోజుల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సీజేఐ ఎన్వీ రమణతో పాటు గవర్నర్‌, సీఎం యాదాద్రి వెళ్లనుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

Read More : Dore Locked: పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ