Dore Locked: పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ

భార్య వేరే వ్యక్తితో ఇంట్లో ఏకాంతంగా ఉండగా భర్త గమనించాడు. బయటి నుంచి తలుపు పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తి తెలిపిన అడ్రస్ కు వచ్చి ఇంట్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

Dore Locked: పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ

Dore Locked

Updated On : June 12, 2021 / 6:03 PM IST

Dore Locked: భార్య వేరే వ్యక్తితో ఇంట్లో ఏకాంతంగా ఉండగా భర్త గమనించాడు. బయటి నుంచి తలుపు పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తి తెలిపిన అడ్రస్ కు వచ్చి ఇంట్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే లోపల ఉన్న మహిళ, మరో వ్యక్తి గడియ పెట్టుకోవడంతో నాలుగు గంటలకు పైగా ఇంటి ముందే నిరీక్షించారు పోలీసులు. కాగా ఈ ఘటన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఏపీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. భర్త బయటినుంచి వచ్చేసరికి భార్య వేరే వ్యక్తితో ఉండడంతో కంగుతిన్నాడు.

పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఇంటి వద్దకు తీసుకొచ్చారు. ఈ లోపే కాలనీ వాళ్ళందరు ఇంటి చుట్టు చేరిపోయారు. దీంతో ఇంట్లో ఉన్న మహిళ, మరో వ్యక్తి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. లోపల గడియ వేసుకొని సుమారు నాలుగు గంటలు పోలీసులను విసిగించారు. ఎంతకు తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొడుతున్నట్లు శబ్దం చేశారు. దీంతో లోపల నుంచి గడియ తీసి ఇద్దరు బయటకు వచ్చారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.