×
Ad

Gautam Gambhir : ’23 ఏళ్ల కుర్రాడిని కాదు.. న‌న్ను టార్గెట్ చేయండి..’ హ‌ర్షిత్ రాణాపై ట్రోలింగ్ పై గంభీర్ రియాక్ష‌న్‌..

హ‌ర్షిత్ రాణాపై జ‌రుగుతున్న ట్రోలింగ్ పై గౌత‌మ్ గంభీర్ (Gautam Gambhir) స్పందించారు.

Shameful to target a 23 year old Gambhir hits back at Srikkanth

Gautam Gambhir : అక్టోబ‌ర్ 19 నుంచి భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య ప‌రిమిత ఓవ‌ర్ల సిరీస్‌లు ప్రారంభం అవుతాయి. తొలుత మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆ త‌రువాత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో భార‌త త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీసుల్లో పాల్గొనే భార‌త జ‌ట్ల‌ను ఇప్ప‌టికే బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ రెండు సిరీస్‌ల‌కు యువ పేస‌ర్ హ‌ర్షిత్ రాణాను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

హెడ్ కోచ్ గంభీర్ ప్రియ‌శిష్యుడు కావ‌డంతోనే అత‌డికి జ‌ట్టులో చోటు ల‌భిస్తోందని, గంభీర్ ఉన్నంత‌కాలం అత‌డి స్థానానికి ఎలాంటి ముప్పు లేద‌ని టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్‌ క్రిష్ణ‌మాచారి శ్రీకాంత్ విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ కామెంట్ల‌పై గంభీర్ స్పందించాడు. 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేయ‌డం సిగ్గు చేట‌న్నారు. త‌నను ల‌క్ష్యంగా చేసుకోవాల‌ని మండిప‌డ్డాడు.

IND vs WI : అందుక‌నే విండీస్‌ను ఫాలో ఆన్ ఆడించాం.. ఫ్లైట్‌లో ప్లాన్ చేస్తాం.. శుభ్‌మ‌న్ గిల్ కామెంట్స్‌..

వెస్టిండీస్ పై భార‌త్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన అనంత‌రం హెడ్ కోచ్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్ర‌మంలోనే హర్షిత్ రాణాపై వచ్చిన విమర్శలపై గంభీర్ మండిప‌డ్డాడు. కొంద‌రు యూట్యూబ్ ఛాన‌ల్‌లో వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేయ‌డం నిజంగా సిగ్గు చేటు అని అన్నాడు. హర్షిత్ రాణా తండ్రి మాజీ చీఫ్ సెలెక్టర్ కాదు. మాజీ క్రికెటర్ కూడా కాద‌న్నాడు.

అతను ఎవరి మద్దతు లేకుండా తన సొంత ప్రతిభతో క్రికెట్ ఆడుతున్నాడన్నాడు. మీరు టార్గెట్ చేయాల‌నుకుంటే త‌న‌ను టార్గెట్ చేయాల‌ని గంభీర్ సూచించాడు. తాను దాన్ని హ్యాండిల్ చేస్తాన‌న్నాడు. అంతేకానీ వ్యూస్ కోసం యువ ఆట‌గాడిని ట్రోల్ చేయ‌డం సిగ్గుమాలిన చ‌ర్య అని గంభీర్ తెలిపాడు.హర్షిత్ రాణా విషయంలోనే కాదు.. భవిష్యత్తులో ఏ ప్లేయ‌ర్ పై కూడా ఇలా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అని గంభీర్ అన్నాడు. .