Shane Warne : షేన్ వార్న్ మృతిపై అనుమానాలు! సంచలన విషయాలు

వార్న్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు స్నేహితులు సీపీఆర్‌ చేసినట్టు తెలిపారు. గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో...

Shane Warne

Shane Warne’s Room Had Blood Stains On Floor : స్పిన్‌ మాంత్రికుడు, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వార్న్‌ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన థాయ్‌లాండ్‌ పోలీసులు.. సంచలన విషయాలు వెల్లడించారు. వార్న్‌ మరణించిన గదిలో ఫ్లోర్‌, టవల్స్‌పై అధిక మోతాదులో రక్తపు మరకలు గుర్తించామని పేర్కొన్నారు. వార్న్‌ మరణించడానికి ముందు భయాందోళనలకు గురై, నరక యాతన అనుభవించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.

Read More : Shane Warne Died : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం

వార్న్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి, ఆసుపత్రికి తరలించడానికి ముందు స్నేహితులు సీపీఆర్‌ చేసినట్టు తెలిపారు. గుండెపై ఒత్తిడి తెచ్చే క్రమంలో అతను రక్తపు వాంతులు చేసుకున్నాడని వార్న్‌ స్నేహితులు ప్రాథమిక విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, థాయ్‌ అధికారులు వార్న్‌ భౌతికకాయానికి శవ పరీక్ష నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు రానుంది. ఒక వేళ వార్న్‌ది అసాధారణ మరణం అయితే పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశముంది. పోస్టుమార్టం అనంతరం వార్న్‌ భౌతికకాయాన్ని స్వస్థలమైన ఆస్ట్రేలియాకు తరలించారు. ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

Read More : Shane Warne: షేన్ వార్న్‌కు రోడ్ యాక్సిడెంట్, 300కేజీల బైక్‌పై అదుపు తప్పి..

ఆస్ట్రేలియా స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 2022, మార్చి 04వ తేదీన హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. 52 ఏళ్ల షేన్‌ వార్న్‌ థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించాడని  తెలుస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా షేన్‌ వార్న్‌ పేరుగాంచాడు. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. ప్రపంచ అత్యుత్తమ లెగ్‌స్పిన్నర్‌గా షేన్‌ వార్న్‌కు గుర్తింపు ఉంది. ఎన్నో మ్యాచుల్లో ఆస్ట్రేలియాను వార్న్‌ ఒంటిచేత్తో గెలిపించాడు. స్టైలిష్‌ బౌలింగ్‌ యాక్షన్‌తో మ్యాజిక్‌ బౌలింగ్‌తో ఎంతో మంది బ్యాట్స్‌మెన్స్‌ ను ముప్పుతిప్పలు పెట్టాడు.

Read More : ఆస్ట్రేలియా బౌలర్ షేన్ వార్న్ పై ఏడాది పాటు నిషేధం

ఆస్ట్రేలియా తరుఫున 145 టెస్టులు మ్యాచ్‌లు ఆడిన షేన్‌ వార్న్‌… 708 వికెట్లు తీశాడు. 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. 2007 జనవరి 7న టెస్ట్‌ క్రికెట్‌కు షేన్‌ వార్న్‌ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2005 జనవరి 10న చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు షేన్‌ వార్న్‌ ప్రాతినిధ్యం వహించాడు. 55 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు. ఐపీఎల్ సీజన్‌ వన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన షేన్‌ వార్న్‌… ఏకంగా తొలి విన్నింగ్‌ కెప్టెన్‌గా నిలిచాడు. షేన్‌ వార్న్‌ బౌలింగ్‌ చేస్తున్నాడంటే బయపడిన బ్యాట్స్‌మెన్స్ ఎంతో మంది ఉన్నారు. ప్రపంచంలోని ఎంతో మంది బ్యాట్స్‌మెన్స్ పలు ఇంటర్య్వూల్లో ఈ విషయాన్ని వెల్లడించారు.