Shane Warne: షేన్ వార్న్‌కు రోడ్ యాక్సిడెంట్, 300కేజీల బైక్‌పై అదుపు తప్పి..

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్‌కు రోడ్ యాక్సిడెంట్ అయిందని ఇంగ్లాండ్ క్రికెట్, క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించాయి. అతని కొడుకు జాక్సన్ వార్న్ తో కలిసి బైక్ వెళ్తున్న సమయంలో

Shane Warne: షేన్ వార్న్‌కు రోడ్ యాక్సిడెంట్, 300కేజీల బైక్‌పై అదుపు తప్పి..

Shane Warne

Updated On : November 29, 2021 / 9:29 AM IST

Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్‌కు రోడ్ యాక్సిడెంట్ అయిందని ఇంగ్లాండ్ క్రికెట్, క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించాయి. అతని కొడుకు జాక్సన్ వార్న్ తో కలిసి బైక్ వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయిందని సిడ్నీ మీడియా తెలిపింది. ముందుగా హాస్పిటల్ అవసర్లేదని భావించిన షేన్.. సోమవారం నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ లో చేరారు.

దాదాపు 300కేజీల వరకూ బరువున్న బైక్ పై నుంచి అదుపు తప్పి కిందపడిపోయాడు షేన్. అలా 15మీటర్ల దూరం వరకూ దొర్లుకుంటూపోయాడు. మెల్‌బౌర్న్ వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. నడుము భాగం, పాదం, చీలమండల్లో తీవ్రంగా గాయాలయ్యాయి. ‘ఇబ్బందిగా ఉండటం వల్లే హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యా’ అని చెప్పుకొచ్చాడు ఈ మాజీ క్రికెటర్.

షేన్ వార్న్.. డిసెంబర్ 8 నుంచి జరగనున్న యాషెస్ సిరీస్ కు కామెంటేటర్ గా వ్యవహరించాల్సి ఉంది. అదే సమయంలో ఇంగ్లాండ్ క్రికెట్, క్రికెట్ ఆస్ట్రేలియాలు కొత్త కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ సిరీస్ నిర్వహించాలనుకుంటున్నారు. ఐదు మ్యాచ్ లలో భాగంగా ఐదు వేదికలపై మ్యాచ్ జరగనుంది. ఐదో మ్యాచ్ ను పెర్త్ వేదికగా నిర్వహిస్తారు.

………………………………………. : ఏపీలో వరదలు..కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ