AP Floods : ఏపీలో వరదలు..కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం, బాధితులకు అందిస్తున్న సహాయ చర్యలపై కేంద్ర బృందానికి వివరించనున్నారు సీఎం జగన్‌.

AP Floods : ఏపీలో వరదలు..కేంద్ర బృందంతో సీఎం జగన్ భేటీ

Ap Floods

AP Floods Central Team : వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర బృందంతో సీఎం జగన్‌ను 2021, నవంబర్ 29వ తేదీ సోమవారం భేటీ కానున్నారు. ఉదయం పది గంటలకు సీఎం క్యాంప్‌ ఆపీస్‌లో సమావేశం జరగనుంది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టం, బాధితులకు అందిస్తున్న సహాయ చర్యలపై కేంద్ర బృందానికి వివరించనున్నారు సీఎం జగన్‌. మరోవైపు.. ఉదయం పదకొండు గంటలకు సీఎం జగన్ వర్షాలు, వరదలపై రివ్యూ నిర్వహించనున్నారు. ఏపీకి మరో రెండ్రోజులు వాన గండం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో.. జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు.

Read More : Smart Power Substations : విశాఖపట్నం జిల్లాలో స్మార్ట్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు

మరోవైపు… బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. వాన ముప్పు పొంచి ఉండటంతో.. రాయలసీమ, కోస్తా ప్రజలంతా.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాల్లో సరాసరి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బుచ్చిలో 14 పాయింట్‌ 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రాకపోకలు బంద్‌ అయ్యాయి. వరద నీరు ముంచెత్తడంతో.. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

Read More : Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో..

చెరువులు నిండు కుండల్లా మారాయి. గూడూరులో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గూడూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో.. విజయవాడ – చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గూడూరు తాళ్లమ్మ గుడి సమీపంలో వరదల్లో తొమ్మిది మంది చిక్కుకోవడంతో.. వారిని ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షితంగా రక్షించాయి. గూడూరు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వరద నీరు చేరింది. ఇప్పటికే వర్షాల్లో నానుతున్న జిల్లా ప్రజలు.. మరోసారి వర్షం బీభత్సం సృష్టిస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.