Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో..

అసలు పేరు.. పి.శేషాద్రి. ఆ పేరు చెబితే ఎవరా? అని అడగొచ్చు తిరుమలలో కూడా.

Dollor Seshadri: పి.శేషాద్రి.. డాలర్ శేషాద్రిగా ఎలా మారారు.. 43ఏళ్లుగా శ్రీవారి సేవలో..

Dollar Seshadhri (1)

Dollor Seshadri: అసలు పేరు.. పి.శేషాద్రి. ఆ పేరు చెబితే ఎవరా? అని అడగొచ్చు తిరుమలలో కూడా. కానీ, డాలర్ శేషాద్రి.. అనే పేరు చెబితే మాత్రం యావత్ ఆంధ్రదేశంలోనే కాదు.. దేశ విదేశాల్లోనూ అందరికీ తెలుసు. అంతగా పేరు ప్రతిష్టలు సాధించారు డాలర్ శేషాద్రి. స్వామి వారి ఉత్సవ విగ్రహాల పక్కన నిత్యం కనిపిస్తూ.. ఉత్సాహంగా ఉంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవీ విరమణ చేసినా.. పదవీకాలాన్ని పొడగించుకొని స్వామివారి సేవలోనే ఉన్నారు శేషాద్రి. దీనిపై అప్పట్లో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

ఎన్ని ప్రభుత్వాలు మారినా శేషాద్రి మాత్రం మారలేదు. స్వామివారి సేవలో తరిచడం డాలర్ శేషాద్రికి అందిన వరం. నియమనిబంధనలు.. అధికారిక హోదాలు.. ఆలయ పద్దతులు ఇవేవీ శేషాద్రికి అడ్డురావు. కనీసం శేషాద్రికి అడ్డుచెప్పేవారు కూడా తిరుమలలో ఎక్కడా కనిపించరు. ఏ ఉత్సవం జరిగినా హడావిడి అంతా శేషాద్రిదే. స్వామి వారి ఉత్సవవిగ్రహాలకు ముందుండి నడిచినా.. పవళింపు సేవలో పాల్గొన్నా.. పవిత్రస్నానాలు చేయించినా డాలర్ శేషాద్రి మాత్రం తప్పనిసరిగా అక్కడే ఉంటారు. శ్రీవారికి హారతులు పడుతూ.. స్వామివారి ముందు సందడి చేస్తుంటారు.

Shivashankar Master : శివశంకర్ మాస్టర్ గురించి మీకు తెలియని విషయాలు..

వీఐపీలెవరైనా స్వామివారి దర్శనానికి వచ్చారంటే.. ముందుగా దర్శించుకునేది డాలర్ శేషాద్రే. వీఐపీలకు రాచమర్యాదలు చేస్తూ.. గర్భగుడిలోకి తీసుకెళ్తారు డాలర్ శేషాద్రి. డాలర్ శేషాద్రి మెడలో ఓ డాలర్ ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఆయనకు డాలర్ శేషాద్రిగా పేరు వచ్చింది. డాలర్ల తయారీ, అమ్మకాలు శేషాద్రే పర్యవేక్షించేవారు. అప్పటినుంచి శేషాద్రి పేరు కాస్తా డాలర్ శేషాద్రిగా మారిపోయింది.

అయితే, 2006లో వెలుగు చూసిన డాలర్ల కుంభకోణం టీటీడీపై మాయని మచ్చగా మిగిలిపోయింది. దాదాపు 305 డాలర్లు మాయమవగా.. తీవ్ర కలకలం రేగింది. దీనిపై వెంటనే స్పందించిన టీటీడీ బోర్డు.. శేషాద్రితో పాటు మరో నలుగురు ఉద్యోగులనూ సస్పెండ్ చేసింది. విచారణకూ ఆదేశించింది. అయితే, కిందిస్థాయి ఉద్యోగులపాత్రే ఇందులో ఉందంటూ.. పై స్థాయిలో ఉన్న శేషాద్రికి క్లీన్ చిట్ ఇవ్వడంతో మళ్లీ విధుల్లో చేరిపోయారు శేషాద్రి.

Dollar Seshadri: గుండెపోటుతో ‘డాలర్’ శేషాద్రి కన్నుమూత